iDreamPost
android-app
ios-app

Pushpa 2: పుష్ప 2 తరువాత సినిమా ఇండస్ట్రీకి దూరం కానున్న సుకుమార్!

  • Published Nov 25, 2024 | 3:08 PM Updated Updated Nov 25, 2024 | 3:08 PM

Pushpa2: సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బాగా బిజీగా ఉన్నాడు. చాలా కష్టపడుతున్నాడు.

Pushpa2: సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 పనుల్లో బాగా బిజీగా ఉన్నాడు. చాలా కష్టపడుతున్నాడు.

  • Published Nov 25, 2024 | 3:08 PMUpdated Nov 25, 2024 | 3:08 PM
Pushpa 2: పుష్ప 2 తరువాత సినిమా ఇండస్ట్రీకి దూరం కానున్న సుకుమార్!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2 సినిమా విడుదల టైమ్ దగ్గర పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న కనీ వినీ ఎరుగని రీతిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు అన్ని పూర్తి అయ్యాయి. అయితే ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తి అవుతుంది. ఆ తరువాత ఈ సినిమా సెన్సార్‌ కి వెళ్లబోతుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతగానో కష్టపడ్డారు. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్‌ అయితే ప్రాణం పెట్టేస్తున్నాడానే చెప్పాలి. రోజులో 20 గంటలు పుష్ప 2 సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ పనులు చూసుకుంటున్నారని తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా ఈ సినిమా షూటింగ్‌తో సుకుమార్‌ బాగా బిజీగా ఉన్నారు.

సినిమా అవుట్ పుట్ పర్ఫెక్ట్ గా రావడానికి పని రక్షసుడిలా మారాడు సుకుమార్. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ఏమాత్రం తేడా రాకూడదని తానే దగ్గర ఉండి అన్ని పనులు చేస్తున్నారు. అందుకే బీహార్‌లో జరిగిన ఈవెంట్‌కి, చెన్నైలో జరిగిన ఈవెంట్‌కి కూడా సుకుమార్ హాజరు కాలేదు. ఇప్పటి దాకా అలుపెరుగని విక్రమార్కుడిలా సుకుమార్‌ సినిమా కోసం కాయ కష్టం చేస్తూనే ఉన్నారు. పుష్ప పార్ట్‌ 1 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే దాదాపుగా నాలుగు ఏళ్ల నుంచి సుకుమార్‌ పుష్ప.. పుష్ప.. అంటూ మరో మాట లేకుండా పని చేస్తున్నారు. అందుకే పుష్ప 2 రిలీజ్ తర్వాత సినిమా ఇండస్ట్రికి దూరం అవ్వాలని అనుకుంటున్నాడు. ఈ విషయం అందరికీ షాకింగ్ అనిపించవచ్చు. కానీ సుకుమార్ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పట్లేదు. ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నాడట. అందుకే ఆయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

పుష్ప 2 సినిమా విడుదల అయ్యాక సుకుమార్ యూఎస్‌ వెళ్లనున్నారని తెలుస్తుంది. అక్కడ సుకుమార్‌ కనీసం ఆరు నెలల పాటు ఫుల్ గా రెస్ట్ తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే అదే సమయంలో రామ్‌ చరణ్ తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్‌ పై కొంచెం వర్క్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి నాలుగు ఏళ్లుగా కష్టపడుతున్న సుకుమార్‌ లాంగ్‌ బ్రేక్ తీసుకుని ఫ్రెష్‌గా రామ్‌ చరణ్ సినిమాకి రెడీ కాబోతున్నారు. ప్రస్తుతం ఉన్న స్ట్రెస్ కి రామ్ చరణ్ సినిమా స్టార్ట్ చేయాలంటే కత్తి మీద సాము లాంటిది. అందుకే ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఆ సినిమా పనులు మొదలు పెట్టాలని సుకుమార్ భావిస్తున్నారట. సుకుమార్ ఇలా గ్యాప్ తీసుకోవడం ఫస్ట్ టైమ్ కాదు. ఆయన ప్రతి సినిమాకి కూడా లాంగ్ గ్యాప్ తీసుకుంటాడు. ఇక ఇంటర్నేషనల్ లెవెల్ లో రాబోతున్న పుష్ప 2 సినిమా తరువాత కూడా లాంగ్ గ్యాప్ తీసుకోకున్నారు. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom