iDreamPost
android-app
ios-app

సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!

  • Published Apr 24, 2024 | 11:49 AM Updated Updated Apr 24, 2024 | 11:49 AM

Director Durai: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ నటులు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూశారు. తాజాగా మరో ప్రముఖ దర్శకులు మరణించారు.

Director Durai: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ నటులు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూశారు. తాజాగా మరో ప్రముఖ దర్శకులు మరణించారు.

  • Published Apr 24, 2024 | 11:49 AMUpdated Apr 24, 2024 | 11:49 AM
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!

ఇటీవల సినీ రంగానికి చెందిన దిగ్గజ నటులు, దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్లు వరుసగా కన్నుమూస్తున్నారు. నాలుగు నెలల కూడా పూర్తి కాలేదు.. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ కి చెందిన నటులు శేషు, విశ్వేశ్వరరావు కన్నుమూశారు. ఆ మధ్య తెలుగు నటుడు వీరభద్రరావు, మాలీవుడ్ నటుడు సుజిత్, డబ్బింగ్ మూవీస్ రచయిత శ్రీ రామకృష్ణ, చత్తీస్‌గఢ్ కి చెందిన నటుడు కన్నుమూశారు. నిన్న కమల్ హాసన్ మామయ్య, పీపుల్స్ జస్టిస్ సెంటర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కన్నుమూశారు. ఈ విషాదాలు మరువక ముందే మరో ప్రముఖ దర్శకుడు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పసిదురై (84) వయోభారం చేత కొడైక్కానల్ లో తుది శ్వాస విడిచారు. 1974 లో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తమిళ ఇండస్ట్రీలో పలు హిట్ చిత్రాలు తీసి మంచి పేరు సంపాదించారు. దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా పలు హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఆయన తన సినిమాాల ద్వారా ఎంతోమంది నటీనటులకు మంచి లైఫ్ అందించారు.  తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 46 సినిమాలకు దర్శకత్వం వహించారు. పసిదురై అసలు పేరు దురై.. 1979 లో ఆయన దర్శకత్వం వహించిన ‘పసి’ పేరును ఆయన ముందు పెట్టుకొని పసి దురై గా ప్రఖ్యాతి పొందారు.

పసి దొరై దర్శకత్వం వహించిన ‘పసి’ మూవీ అప్పట్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి ఇలా మూడు కేటగిరిల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు తమిళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు, ఫిలిమ్ ఫేర్ అవార్డులు గెల్చుకుంది. కలెక్షన్లు కూడా బాగా రాబట్టింది. అందుకే ఆయన పేరు అలా మార్చుకున్నారు. పసి దొరై ‘పసి’ చిత్రంతో పాటు అవళుల్ పెణ్‌దానే, ఒక వీడు ఒరు ఉలగం, కిళింజల్ గళ్, అశై 60 నాళ్, పావత్తిన్ సంబళం లాంటి సినిమాలను తెరకెక్కించారు. అప్పట్లో ఆయన సినిమాల్లో ప్రతి విషయంలో ఏదో ఒక ప్రత్యేకత చూపించేవారు.  పసి దొరై మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.