iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో చిన్నోడు.. నెక్ట్ లెవల్ కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ కాలు నాదే... ఈ కాలు కూడా నాదే అంటూ కాలు మీద కాలు వేసుకున్న నటుడు అమెరికాలో ఉద్యోగం వదిలేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో నవ్వులు పువ్వులు పూయిస్తున్న స్టార్ కమెడియన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ కాలు నాదే... ఈ కాలు కూడా నాదే అంటూ కాలు మీద కాలు వేసుకున్న నటుడు అమెరికాలో ఉద్యోగం వదిలేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో నవ్వులు పువ్వులు పూయిస్తున్న స్టార్ కమెడియన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.

ఈ ఫోటోలో చిన్నోడు.. నెక్ట్ లెవల్ కమెడియన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో కాలు మీద కాలు వేసుకున్న ఈ చిన్నోడు.. టాలీవుడ్ స్టార్ యాక్టర్. అమెరికాలో సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని.. లక్షల్లో జీతాన్ని వదిలేసి.. తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేందుకు వచ్చేశాడు. తన కామెడీతో నవ్వులు పువ్వులు పూయిస్తున్నాడు. అతడి కామెడీ టైమింగ్ అదుర్స్. వెటకారంతో కూడిన హాస్యం అయితే ఇక చెప్పనక్కర్లేదు. నెక్ట్ లెవల్ కామెడీ అంతే. ఇంతకు ఆ పిల్లగాడు ఎవరంటే.. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ఈ నటుడు.. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. వెన్నెల మూవీతో కెరీర్ స్టార్ చేసి.. ఆ పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో కూడా నటించాడు వెన్నెల కిషోర్.  ఈ గురువారం ఈ హాస్య నటుడి పుట్టిన రోజు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.

తెలంగాణాలోని కామారెడ్డిలో 1977 సెప్టెంబర్ 19న జన్మించాడు వెన్నెల కిషోర్. ఈయన అసలు పేరు బొక్కల కిశోర్ కుమార్. చదువుల నిమిత్తం హైదరాబాద్ వచ్చిన కిశోర్.. హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లిపోయాడు. మిచిగాన్‌లోని ఫెర్రీస్ స్టేట్ యూనివర్శిటీలో ఎంఎస్ పూర్తి చేసిన ఈ కమెడియన్.. అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేశాడు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా.. తొలి మూవీ వెన్నెలలో ఫ్రెండ్ స్నేహితుల్లో ఒకరిగా కనిపించాడు. ఖాదర్ భాషా పాత్రలో కామెడీ పండించాడు. ఈ సినిమాతోనే వెన్నెల కిశోర్‌గా మారాడు. ఇక సినిమాల్లో ఆఫర్లు రావడంతో ఇండియాకు వచ్చేసి ఫుల్ టైం నటుడిగా ఛేంజ్ అయ్యాడు. బిందాస్, ప్రస్తానం, ఆహా నాపెళ్లంట చిత్రాలు మంచి పేరు తెచ్చాయి.

Vennela Kishore, 01

ఇక అక్కడి నుండి అందర్ని నోళ్లల్లో రిజిస్టర్ అయ్యాడు కమెడియన్. దూకుడులో మహేష్ బాబు సహోద్యోగిగా.. జాతకాల పిచ్చి ఉన్న వ్యక్తిగా నటించి మెప్పించాడు. ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూడలేదు. ఎక్కువగా హీరోలకు ఫ్రెండ్‌గా కనిపించాడు. సుమారు ఈ 20 ఏళ్లలో 300లకు పైగా సినిమాల్లో నటించాడు. అలాగే హీరోగా కూడా చేశాడు. అతడు ఆమె ఓ స్కూటర్, ఎలుకా మజాకా, చార్టీ 111 వంటి చిత్రాల్లో హీరోగానూ మెప్పించాడు. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించాడు. అలాగే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. వెన్నెల వన్ బైటు, బ్రహ్మానందం మెయిన్ రోల్ చేసిన జప్ఫా చిత్రాలకు దర్శకుడు ఈయనే. తాజాగా మత్తు వదలరా చిత్రంతో మెప్పించాడు. చేతినిండా సినిమాలతో బిజీ కమెడియన్ గా కొనసాగుతున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by vishwa bharath (@vishwabharath.b)