P Krishna
సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు పలు కారణాలతో వరుసగా కన్నుమూస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు పలు కారణాలతో వరుసగా కన్నుమూస్తున్నారు.
P Krishna
ఈ మద్యకాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రముణ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ల ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. వృద్దాప్యం, అనారోగ్యం, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు విషాదంతో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టార్ కమెడియన్ రాజు శ్రీ వాత్సవ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే.. మరో స్టార్ కమెడియన్ బోండ మణి (59) ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంత కాలం క్రితం ఆయన మూత్ర పిండాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు కుటుంబ సభ్యులు. వారం రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని.. చికిత్స పొందుతున్న క్రమంలోనే తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.
బోండ మణి సెప్టెంబర్ 19, 1963 లో జన్మించారు. ఆయన అసలు పేరు కేదీశ్వరన్.. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో పుట్టి పెరిగాడు. శ్రీలంక శరణార్ధి అయిన మణి తమిళనాడుకు వలస వచ్చాడు. తన కెరీర్ లో దాదాపు 270 సినిమాలకు పైగా నటించారు. ఆరు, సుందర్ ట్రావెల్స్, మరుధమలై, విన్నర్ , వేలాయుధం తదితర సినిమాల్లో నటించారు. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మణి 1990లో శ్రీలంకకు తిరిగి వచ్చి “లతా స్టోర్స్” అని పేరుతో కిరాణా దుకాణాన్ని ప్రారంభించాడు. 1990లో ఒక కాలు దాదాపు పక్షవాతానికి గురై ఇబ్బంది పడుతున్నారు. బోండా మణి కన్నుమూయడంతో సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.