ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే వినిపిస్తుంది. దాదాపు చేతిలో ఎనిమిది సినిమాలకు పైగా లైనప్ చేసి ఫుల్ బిజీ అయిపోయింది. అలాంటిది ఇంతలో ఫామ్ లో ఉన్నప్పుడు రిస్క్ చేస్తుందా? అనంటే చేసేలా ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. ఇంతకీ శ్రీలీల ఎలాంటి రిస్క్ చేస్తోంది? అనే వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ గా సూపర్ ఫామ్ లో.. ట్రెండ్ అవుతున్నప్పుడు ఎవరు కూడా ఐటమ్ సాంగ్స్ చేయాలని ఆలోచించరు. ఎందుకంటే.. కెరీర్ దెబ్బ తింటుందని.. కెరీర్ పైన ఎఫెక్ట్ పడుతుందని ఆగిపోతుంటారు. కానీ.. రిస్క్ చేసి గెలిచేవారు రేర్ గా ఉంటారు. తమన్నా, సమంత అలాంటి రిస్క్ చేసి కూడా తిరిగి ఫామ్ కొనసాగించారు.
కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు తమన్నా.. అల్లుడు శీను, సరిలేరు నీకెవ్వరూ, గని లాంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసింది.. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది. మరోవైపు కాజల్ ఫామ్ లో ఉండి కూడా ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ లో ఐటమ్ సాంగ్ చేసి అల్లాడించింది. ఆ తర్వాత మళ్లీ తన సినిమాలు తాను చేసుకుంది. అలాగే స్టార్ హీరోయిన్ సమంత.. హీరోయిన్ గా సినిమాలు చేస్తూ.. ఓవైపు పుష్ప సినిమాలో ‘ఊ అంటావా మావ’ అంటూ పాన్ ఇండియాని షేక్ చేసేసింది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. ఆ సాంగ్ తో సమంత కూడా అంతే పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఇదే బాటలో శ్రీలీల అడుగు వేయనున్నట్లు తెలుస్తోంది.
అదేంటీ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయబోతుందా? అనంటే.. అవునని టాక్ నడుస్తోంది. హీరోయిన్ గా ప్రస్తుతం 9 సినిమాలతో బిజీ అయ్యింది అమ్మడు. అలాంటిది ఏకంగా పాన్ ఇండియా మూవీలో ఐటమ్ సాంగ్ చేసేందుకు ఆఫర్ కొట్టేసిందని టాక్. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 పై ఫ్యాన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఆ సినిమా కోసం చాలా ట్రెండీ ట్యూన్స్ రెడీ చేస్తున్నాడట దేవిశ్రీ ప్రసాద్. అలాగే ఓ క్రేజీ ఐటమ్ సాంగ్ కూడా సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే.. ఈ సాంగ్ కోసం పుష్ప 2 టీమ్ శ్రీలీలను సంప్రదించగా.. కాస్త టైమ్ కావాలని చెప్పినట్లు సమాచారం. ఈ న్యూస్ తెలిసి ప్రస్తుతం పుష్ప ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి శ్రీలీల ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.