iDreamPost
android-app
ios-app

Spirit: ‘స్పిరిట్’పై అంచనాలు పెంచేసిన సందీప్ వంగా.. తన కెరీర్ బెస్ట్ అంటూ!

  • Published Jul 16, 2024 | 10:10 PMUpdated Jul 16, 2024 | 10:45 PM

Sandeep Reddy Vanga: డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై సందీప్ అంచనాలు పెంచేశారు.

Sandeep Reddy Vanga: డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంపై సందీప్ అంచనాలు పెంచేశారు.

  • Published Jul 16, 2024 | 10:10 PMUpdated Jul 16, 2024 | 10:45 PM
Spirit: ‘స్పిరిట్’పై అంచనాలు పెంచేసిన సందీప్ వంగా.. తన కెరీర్ బెస్ట్ అంటూ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోష్​లో ఉన్నారు. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్​బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రంతో రూ.1,000 కోట్ల క్లబ్​లోకి అడుగుపెట్టారు ప్రభాస్. ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ రేంజ్​ సక్సెస్​ను ‘కల్కి’తో చూశారాయన. వెయ్యి కోట్ల మార్క్​ను అందుకోవడం రెబల్ స్టార్ కెరీర్​లో ఇది రెండోసారి కావడం విశేషం. ఈ ఫిల్మ్ రిలీజై రెండు వారాలైనా బాక్సాఫీస్ వద్ద ఇంకా హవా అలాగే నడుస్తోంది. నాగ్ అశ్విన్ మేకింగ్, ప్రభాస్​తో పాటు అమితాబ్, దీపికా, కమల్ హాసన్ నటన, విజువల్ ఎఫెక్ట్స్, మహాభారతం ఎపిసోడ్స్ సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నాయి. ‘కల్కి’ ఊహించని విజయం సాధించడంతో నెక్స్ట్ ఫిల్మ్​పై ప్రభాస్ ఫోకస్ పెడుతున్నారు.

మారుతి తీస్తున్న ‘రాజాసాబ్’, ప్రశాంత్ నీల్​తో ‘సలార్ 2’తో పాటు హను రాఘవపూడితో ఓ సినిమాకు ప్రభాస్ కమిట్ అయ్యారు. అలాగే డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే ఫిల్మ్​ను కూడా పైప్​లైన్​లో ఉంచారు రెబల్ స్టార్. ఈ సినిమా పనులతో సందీప్ వంగా బిజీగా ఉన్నారు. ఇందులో ప్రభాస్​ను ఢీకొట్టే విలన్ పాత్రలో ప్రముఖ కొరియన్ నటుడు డాంగ్ సూక్ (డాన్ లీ) కనిపించబోతున్నారని సమాచారం. ‘ద ఔట్ లాస్’, ‘ద రౌండప్’ వంటి సూపర్ హిట్స్​తో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న డాన్ లీ గనుక ‘స్పిరిట్’లో నటిస్తే ఈ ప్రాజెక్ట్​కు ఇంటర్నేషనల్ వైడ్​గా క్రేజ్ రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇలా ఎక్స్​పెక్టేషన్స్​ పెరిగిపోతున్న ‘స్పిరిట్’పై డైరెక్టర్ సందీప్ వంగా మరిన్ని అంచనాలు పెంచేశారు. ఇది తన కెరీర్​లో బెస్ట్ ఫిల్మ్ అన్నారు.

‘నా కెరీర్​లో ‘యానిమల్’ బెస్ట్ ఫిల్మ్ అని అంతా అంటున్నారు. కానీ నా బెస్ట్ వర్క్ ఏంటో ‘స్పిరిట్’ మూవీతో అందరికీ చూపిస్తా’ అని సందీప్ రెడ్డి వంగా అన్నారు. సందీప్ వంగా చేసిన కామెంట్స్​తో ప్రభాస్ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ‘అర్జున్ రెడ్డి’తో ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ వంగా మొదటి చిత్రంతోనే బ్లాక్​బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్​లో అదే మూవీని ‘కబీర్ సింగ్​’గా రీమేక్ చేసి మళ్లీ సక్సెస్​ను అందుకున్నారు. ఆ తర్వాత హిందీ సూపర్ స్టార్ రణ్​బీర్ కపూర్​తో ‘యానిమల్’ తీసి సూపర్​డూపర్ హిట్ కొట్టారు. దీంతో జోష్​లో ఉన్న సందీప్ వంగా ప్రభాస్​తో ‘స్పిరిట్​’ మూవీ తీస్తున్నారు. భారీగా ఎక్స్​పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా తన కెరీర్​లో బెస్ట్ అని డైరెక్టర్ అనడంతో ప్రభాస్ ఫ్యాన్స్​కు ఫుల్ మీల్స్ అని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. రెబల్ స్టార్​కు ఇంకో రూ.1,000 కోట్ల చిత్రం లోడింగ్ అని చెబుతున్నారు. మరి.. ‘స్పిరిట్’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by FilmyScoops | తెలుగు (@filmyscoops)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి