iDreamPost
android-app
ios-app

Sitara Ghattamaneni: నిజంగా అమ్మ చాలా గ్రేట్.. తనకు గొప్ప మోడలింగ్ కెరీర్ ఉండేది: సితార

  • Published Aug 23, 2024 | 7:55 PM Updated Updated Aug 23, 2024 | 9:09 PM

Sitara Ghattamaneni About Namrata Shirodkar: సితార ఘట్టమనేని తాజాగా ఐడ్రీమ్ మీడియాకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన చదువు, కెరీర్, వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో తన తల్లి నమ్రతా శిరోద్కర్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యింది.

Sitara Ghattamaneni About Namrata Shirodkar: సితార ఘట్టమనేని తాజాగా ఐడ్రీమ్ మీడియాకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన చదువు, కెరీర్, వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యుల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో తన తల్లి నమ్రతా శిరోద్కర్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యింది.

  • Published Aug 23, 2024 | 7:55 PMUpdated Aug 23, 2024 | 9:09 PM
Sitara Ghattamaneni: నిజంగా అమ్మ చాలా గ్రేట్.. తనకు గొప్ప మోడలింగ్ కెరీర్ ఉండేది: సితార

పెళ్ళికి ముందు ఎన్ని ఉన్నా గానీ పెళ్లి తర్వాత ఆడపిల్లల జీవితం పూర్తిగా మారిపోతుంది. భర్త, పిల్లలే ప్రపంచంగా జీవిస్తుంటారు. తన కుటుంబం కోసం అన్నీ వదిలేసుకుంటారు. సాధించిన విజయాలు, చేధించిన గమ్యాలు అన్నీ ఒక జ్ఞాపకంగా దాచుకుంటారు. సాధించాల్సింది, చేధించాల్సింది ఏమైనా ఉన్నాయా అంటే అది భర్త, పిల్లల రూపంలో నెరవేర్చుకుంటారు. ఇది సాధారణ గృహిణుల విషయంలోనే కాదు.. స్టార్ సెలబ్రిటీల విషయంలో కూడా జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణిగా ఉన్న నమ్రతా శిరోద్కర్ పెళ్ళికి ముందు హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు అందాల పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు.

అయితే పెళ్లయ్యాక మోడలింగ్ కెరీర్, యాక్టింగ్ కెరీర్ ని వదులుకున్నారు. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనే ఒకే ఒక్క కారణంతో ఆమె తన కెరీర్ ని వదులుకున్నారు. ఆమె త్యాగం వృధా పోలేదని పిల్లలు గౌతమ్, సితార పెరిగిన విధానమే తెలుస్తుంది. నలుగురికి సేవ చేసే గుణం, తోటి మనుషులతో కలిసిపోయే తత్వం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, సంస్కారం వంటివి నేర్పించారు. చదువు, డ్యాన్స్, యాక్టింగ్ సహా పలు ఇతర యాక్టివిటీస్ ని పిల్లలకు నేర్పిస్తూనే సామాజికంగా ఎంత బాధ్యతగా ఉండాలో కూడా నేర్పిస్తున్నారు. తాజాగా సితార ఐడ్రీమ్ మీడియాతో ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో నమ్రతా శిరోద్కర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది.

sitara talking about her mother

ఇంటర్వ్యూలో తన స్కూలింగ్ గురించి, ఆటపాటల గురించి, అన్నయ్య గౌతమ్ గురించి, మహేష్ బాబు, నమ్రతా గురించి, కెరీర్ గురించి ఇలా అనేక అంశాల గురించి చర్చించింది. యాక్టింగ్ అంటే ఇష్టమో కాదో చెప్పింది. ఎలాంటి సినిమా రోల్స్ అంటే ఇష్టమో చెప్పింది. అభిమానించే హీరోలు, హీరోయిన్లు ఎవరో చెప్పింది. ఇలా అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే తన తల్లి నమ్రతా శిరోద్కర్ మోడలింగ్ కెరీర్ గురించి పలు విషయాలను పంచుకుంది. మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ కూతురివి కదా ఎలా అనిపిస్తుంది? అందాల పోటీలు చాలా టఫ్ కదా అన్న ప్రశ్నకు సితార జవాబిచ్చింది. ‘అవును అందాల పోటీ కఠినమైనదే.. అమ్మ చాలా గ్రేట్.. గ్రేట్ మోడలింగ్ చేసింది.. తనది గొప్ప మోడలింగ్ కెరీర్. అమ్మ కెరీర్ చాలా అందమైనది. అమ్మ మిస్ ఇండియా ఫోటోలంటే ఎంతగానో ఇష్టం’ అంటూ భావోద్వేగానికి గురైంది. అమ్మ స్టైల్ నే ఇప్పటికీ అనుసరిస్తానని, అందాల పోటీల్లో అవకాశం వస్తే ఖచ్చితంగా పాల్గొంటానని కూడా వెల్లడించింది. 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet