iDreamPost
android-app
ios-app

Singer Kousalya: సింగర్ కౌసల్య పేరుతో మోసం! ఆకతాయిల పనిపై ఆగ్రహం

  • Author Soma Sekhar Published - 12:53 PM, Sun - 3 December 23

తన పేరుతో ఓ ఆకతాయి చేస్తున్న మోసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు సింగర్ కౌసల్య. అందుకు సంబంధించి ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తన పేరుతో ఓ ఆకతాయి చేస్తున్న మోసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు సింగర్ కౌసల్య. అందుకు సంబంధించి ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

  • Author Soma Sekhar Published - 12:53 PM, Sun - 3 December 23
Singer Kousalya: సింగర్ కౌసల్య పేరుతో మోసం! ఆకతాయిల పనిపై ఆగ్రహం

సోషల్ మీడియా.. టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలంలో అదే రేంజ్ లో మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. వాటి వాడకం ఎక్కువైన కొద్దీ కొత్త రకాల మోసాలు పుట్టుకొస్తున్నాయి. ఇక ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలను హ్యాక్ చేయడమే కాకుండా.. ఫేక్ అకౌంట్లను సృష్టిస్తూ.. మోసాలకు పాల్పడుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు. ఈ మధ్య వాట్సాప్ లోనూ ఇలాంటి తరహా మోసాలు జరుగుతూ ఉన్నాయి. వాట్సాప్ లో ఫేక్ డీపీలు, ఫేక్ నంబర్లతో ప్రజలతో పాటు సెలబ్రిటీలనూ బురిడీ కొట్టిస్తున్నారు మోసగాళ్లు.  తన పేరుతో ఓ ఆకతాయి చేస్తున్న మోసాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు సింగర్ కౌసల్య.

సింగర్ కౌసల్య.. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ సింగర్ గా వెలుగొందారు. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సారథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాల్లో కౌసల్య తన మార్క్ చూపించారు. అప్పట్లో ఆమె పాటలకు యూత్ లో క్రేజ్ మామూలుగా ఉండేది కాదు. అయితే యువ గాయకులు తెరపైకి వస్తున్న ఈ రోజుల్లో ఆమె బాగా వెనకబడిపోయారు. ప్రస్తుతం ఆమె గొంతు సినిమాల్లో వినిపించడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను షేర్ చేసింది కౌసల్య. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు..

” సోషల్ మీడియాలో కొంత మంది తన పేరు, నంబర్ అంటూ ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. అది నా నంబర్ కాదు.. నా అకౌంట్ కాదు. ఎవరో నా ఫొటో డీపీ పెట్టుకుని, చాట్ చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి” అని తన ఫాలోవర్లకు సూచించింది. ఇక ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తన ఫాలోవర్లు ఇలాంటి వారితో చాటింగ్ లు కానీ, డబ్బులు పంపడం కానీ చేయెద్దని పేర్కొంది. కాగా.. గతంలోనూ ఓసారి కౌసల్యకు ఇదే సమస్య ఎదురైంది. ఈ విషయంపై వెంటనే స్పందించి.. ఆ మోసాలను బయటి ప్రపంచానికి చెప్పి.. ఫాలోవర్లను అప్రమత్తం చేసింది. తాజాగా మరోసారి అలాంటి మోసమే కౌసల్యకు ఎదురుకావడంతో ఈ విధంగా స్పందించింది.

 

View this post on Instagram

 

A post shared by KOUSALYA (@singerkousalya)