Somesekhar
విశ్వక్ సేన్.. రీల్ హీరోగానే కాకుండా.. రియల్ హీరోగా మన్ననలు పొందుతున్నాడు. చిన్న సినిమాల పాలిట దేవుడిగా మారుతూ.. అప్ కమింగ్ హీరోలకు అండగా నిలబడుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
విశ్వక్ సేన్.. రీల్ హీరోగానే కాకుండా.. రియల్ హీరోగా మన్ననలు పొందుతున్నాడు. చిన్న సినిమాల పాలిట దేవుడిగా మారుతూ.. అప్ కమింగ్ హీరోలకు అండగా నిలబడుతున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
24 క్రాఫ్ట్ లను ఏకం చేసి.. ఓ సినిమాను నిర్మించి.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మామూలు విషయం కాదు. అందుకోసం ఓ పెద్ద యుద్ధమే చేయాలి. మూవీ రిలీజ్ అయ్యేంతవరకు నటీ, నటులకు కంటిమీద కునుకు ఉండదు అంటే అతిశయోక్తికాదు. అయితే ఇది స్టార్ హీరోల విషయంలో కాస్త భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే? వారికున్న క్రేజ్, పెద్ద నిర్మాణ సంస్థలు కావడంతో ఈజీగానే జనాల్లోకి సినిమా వెళ్లిపోతుంది. కానీ చిన్న హీరోల సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ప్రమోషన్ల కోసం నిర్మాతల దగ్గర అంతగా మనీ ఉండదు. అప్ కమింగ్ హీరోలు కావడంతో వారికి క్రేజ్ కూడా తక్కువే. ఈ సమస్యల కారణంగా మంచి సినిమాలు ఆదరణకు నోచుకోకుండా పోతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి చిత్రాల పాలిట దేవుడిగా మారాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. చిన్న సినిమాలను కాపాడుతూ.. మనసున్న, రియల్ హీరోగా మన్ననలు పొందుతున్నాడు.
విశ్వక్ సేన్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో రావడమే కాదు, స్టార్ హీరోగా నిలదొక్కుకుని దూసుకెళ్తున్నాడు. వరుసబెట్టి సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే విశ్వక్ ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికి తెలిసిందే. తాను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైమ్ లో తన మూవీస్ ను షేర్ చేయమని, స్టేటస్ లు పెట్టుకోమని తన స్నేహితులను అడిగినట్లు ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ‘వెళ్లిపోమాకే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో గుర్తుండిపోయే విజయాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత అవకాశాల కోసం ఎదురుచూశాడు. ఇక ఇవన్నీ అయ్యే పనికాదని తానే ఓ సినిమాను(ఫలక్ నుమాదాస్) హీరోగా నిర్మించి.. ఇండస్ట్రీలో మాస్ కా దాస్ గా నిలదొక్కుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇప్పుడు మరోసారి తన గొప్పమనసును చాటుకుంటూ.. చిన్న సినిమాలను కాపాడుతున్న దేవుడిగా మారుతున్నాడు.
స్టార్ హీరోల సినిమాలకు ఎలాంటి ప్రమోషన్లు లేదా ఓ మోస్తారు ప్రమోషన్లు జరిగినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. కానీ చిన్న సినిమాల విషయంలో అలా కాదు. అందులో హీరో ఎవరు? ఇంతకు ముందు ఏం మూవీ చేశాడు? డైరెక్టర్ ఎవరు? ట్రైలర్ బాగుందా? ఇలా సవాలక్ష చూసిన తర్వాత గానీ.. సినిమాకు వెళ్దాం అన్న ఆలోచనకు రారు. అలాంటి స్మాల్ మూవీస్ కు పెద్దదిక్కుగా మారి.. ప్రమోషన్ కార్యక్రమాలకు వెళ్తున్నాడు విశ్వక్. పిలిస్తే చాలు.. ఎంత చిన్న మూవీ ప్రమోషన్ ఈవెంట్ కైనా వెళ్తాడు విశ్వక్. అలా అని అతడు షూటింగ్స్ లేకుండా లేడు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంతటి బిజీ షెడ్యూల్ లో కూడా చిన్న చిత్రాలను కాపాడటానికి తనవంతు కృషి చేస్తున్నాడు.
ఇక ప్రమోషన్ కార్యక్రమానికి వచ్చామా? మట్లాడామా? వెళ్లామా? అన్నట్లుగా విశ్వక్ వ్యవహరించడు. అతడి తీరే వేరు. సినిమా ఏంటి? దానిని ఎంత కష్టపడి తీశారు? అందులో ఉన్న క్రూ ఎవరు? ఇలా అన్ని అంశాల గురించి మాట్లాడి.. ప్రమోషన్లకు బ్యాక్ బోన్ గా నిలుస్తున్నాడు. మీరు గమనిస్తే ఈ ఒక్క వారంలోనే మూడు నుంచి నాలుగు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు విశ్వక్ హాజరైయ్యాడు. దాంతో ఆ సినిమాలు జీవం పోసుకున్నాయి. ‘పేకమేడలు’, ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రాలకు విశ్వక్ ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు.
మరీ ముఖ్యంగా రోటీ కపడా రొమాన్స్ చిత్ర హీరోలను పిలిచి మరీ ఫొటో తీయించుకున్నాడు విశ్వక్. ఇది అక్కడున్న వారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి తెలియని ఎన్నో సంఘటనలు అతడి కెరీర్ లో ఉన్నాయి. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పడ్డ కష్టాలు.. అప్ కమింగ్ హీరోలు పడకూడదనే ఉద్దేశంతో.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ యంగ్ హీరోలకు సాయం చేస్తున్నాడు. వారు కూడా మంచి విజయాలు సాధించి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని తనవంతు సాయం చేస్తున్నాడు విశ్వక్. మరి చిన్న సినిమాల పాలిట దేవుడిగా మారి, రియల్ హీరోగా ఎదుగుతున్న విశ్వక్ సేన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.