iDreamPost
android-app
ios-app

ప్రభాస్ పై కామెంట్స్ చేసిన అర్షద్ పై సిద్దు జొన్నలగడ్డ ఆగ్రహం!

  • Published Aug 21, 2024 | 5:05 PM Updated Updated Aug 21, 2024 | 5:25 PM

Siddhu Comments On Arshad Warsi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఆయనపై టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Siddhu Comments On Arshad Warsi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఆయనపై టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Published Aug 21, 2024 | 5:05 PMUpdated Aug 21, 2024 | 5:25 PM
ప్రభాస్ పై కామెంట్స్ చేసిన అర్షద్ పై  సిద్దు జొన్నలగడ్డ ఆగ్రహం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, యంగ్ డైరెక్ట్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కల్కి 2898ఏడీ‘.  జూన్ 21న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. అంతేకాక ప్రపంచ నలుమూల నుంచి కల్కి సినిమాకు ప్రశంసల వర్షం కురిసింది. ఇలా అందరూ కల్కి మూవీ, ప్రభాస్ నటనపై  ప్రశంసలు కురిపిస్తుంటే..బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ మాత్రం వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉందంటూ చేసిన వాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనపై ఫైర్ అయ్యారు. తాజాగా అర్షద్ పై హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన విమర్శలు చేయడం సరికాదంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

‘‘ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉంది. మన ఆలోచనకు,అభిరుచికి అనుగుణంగా ఒక్కో నటుడ్ని, మూవీని ఇష్టపడుతుంటాం. అలాగే వేరే వాళ్ల సినిమాలను, వేరే యాక్టర్స్ ను విమర్శలు చేస్తుంటాం. అయితే, ఆ విమర్శలను ఎలా వ్యక్తం చేస్తున్నామనేది చాలా ముఖ్యమైన విషయం. నిర్మాణాత్మక, వివరణాత్మక విమర్శలు చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ, జోకర్‌ లాంటి కించపరిచే పదాలను ఉపయోగించడం సరికాదు. ‘కల్కి 2898 ఏడీ‘ సినిమా అనేది జోక్ కాదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ చిత్రమిది.

ఎవరి ఊహలకు అందని విధంగా నాగ్‌ అశ్విన్‌  ఈ సినిమాను తెరకెక్కించారు. రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను రూపొదించడం అంత సులభం కాదు. ఇండియన్ స్టార్‌ హీరోల్లో ప్రభాస్‌ అన్న ఒకరు. అందుకు ఒక కారణం కూడా ఉంది.  ఆయనకు సక్సెలకు మించిన స్టార్‌డమ్‌ ఉంది. ప్లాప్ అయిన ఆయన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.  ‘కల్కి 2898ఏడీ’ సినిమా సక్సెస్ వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ప్రభాస్ అన్న ఒకరు. ఒక అభిమానిగా వాస్తవాలు మాత్రమే చెబుతున్నా. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మేము ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తాం. దయ చేసి పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం’’ అని సిద్దు జొన్నలగడ్డ ట్వీట్‌ చేశారు. మరి.. అర్షద్ పై సిద్దు చేసిన వ్యాఖ్యలపై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio