స్టార్ ప్రొడ్యూసర్‌పై యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని సీరియస్ అయ్యారు. నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఫైర్ అయ్యారు.
స్టార్ ప్రొడ్యూసర్‌పై యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని సీరియస్ అయ్యారు. నీకు ఇంత ధైర్యం ఎక్కడిదని ఫైర్ అయ్యారు.
సముద్రఖని.. తెలుగు ఆడియెన్స్‌కు పరిచయం అక్కర్లేని పేరిది. డైరెక్టర్‌గా, యాక్టర్‌గా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఆయన మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. మాస్ మహారాజా రవితేజ, అల్లరి నరేష్ కలయికలో తెరకెక్కిన ‘శంభో శివ శంభో’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు సముద్రఖని. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించారు. అయితే మూవీ బాగుందనే టాక్ తెచ్చుకున్నా వసూళ్లలో మాత్రం వెనుకబడింది. ఆ తర్వాత తమిళ సినిమాలతో బిజీ అయిపోయిన ఆయన తెలుగులో నటుడిగా మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డైరెక్టర్‌గా గాక యాక్టర్‌గానే ఆయనకు ఇక్కడ మంచి ఆదరణ దక్కింది. రవితేజ ‘క్రాక్’ మూవీతో ఆయన ఇక్కడ సెటిలైపోయారు.
‘సర్కారు వారి పాట’, ‘అల వైకుంఠపురం’, ‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘గాడ్‌ఫాదర్’, ‘విమానం’ చిత్రాలు సముద్రఖనికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇటీవల మరోమారు దర్శకుడిగా మారి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘బ్రో’ సినిమాను తీశారాయన. అలాంటి ఆయన ఓ స్టార్ ప్రొడ్యూసర్‌పై సీరియస్ అయ్యారు. ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా మీద సముద్రఖని ఫైర్ అయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన ఫస్ట్ ఫిల్మ్ ‘పరుత్తివీరన్’. 16 ఏళ్ల కింద రిలీజైన ఈ మూవీ విషయంలో కొన్ని రోజుల నుంచి చిత్ర దర్శకుడు ఆమిర్‌కు ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌కు మధ్య కాంట్రవర్సీ కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌కు మద్దతుగా నిలిచిన సముద్రఖని.. తాజాగా ఒక లెటర్‌ను విడుదల చేశారు. ‘పరుత్తివీరన్’లో తాను యాక్ట్ చేశానన్నారు. ఆ ఫిల్మ్ తీయడానికి దర్శకుడు ఆమిర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని అన్నారు.
జ్ఞానవేల్ రాజా మాత్రం ఒక్క రోజు కూడా ‘పరుత్తివీరన్’ సెట్‌కు వచ్చింది లేదన్నారు సముద్రఖని. మూవీ బడ్జెట్ విషయంలోనూ డైరెక్టర్‌కు ఆయన సహకరించలేదన్నారు. ‘పరుత్తివీరన్‌లో నేనూ యాక్ట్ చేశా. ఆ సినిమా టైమ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న దర్శకుడు ఆమిర్‌కు నువ్వు (నిర్మాత జ్ఞానవేల్ రాజాను ఉద్దేశించి..) ఏమాత్రం సహకరించలేదు. నా దగ్గర డబ్బుల్లేవ్.. నేను ఈ మూవీ చేయనని షూటింగ్ మధ్యలోనే చేతులెత్తేశావ్. కానీ బంధువుల వద్ద నుంచి అప్పులు తీసుకొచ్చి మరీ ఆమిర్ చిత్రాన్ని పూర్తి చేశాడు. దీనికి నేనే సాక్ష్యం. అతను ఎంతో కష్టపడి సినిమా పూర్తి చేస్తే ప్రొడ్యూసర్ అనే క్రెడిట్ నువ్వు పొందావ్. ఈ రోజు నువ్వు డైరెక్టర్‌ను తప్పబడుతూ కామెంట్స్ చేస్తున్నావ్. ఇది అస్సలు బాగోలేదు. నీకు ఇంత ధైర్యం ఎక్కడిది?’ అని సముద్రఖని ప్రశ్నించారు.
సముద్రఖని రాసిన లేఖ తమిళ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కాగా, కార్తి నటించిన రీసెంట్ మూవీ ‘జపాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయనతో పనిచేసిన దర్శకులందరూ వచ్చారు. కానీ ఆమిర్ మాత్రం రాలేదు. దీనిపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఆహ్వానం అందనందునే ‘జపాన్’ ఈవెంట్‌కు రాలేదన్నారు. దీని మీద జ్ఞానవేల్ రాజా రియాక్ట్ అవుతూ.. ఆహ్వానం పంపామని.. కానీ రాలేదన్నారు. ‘పరుత్తివీరన్’ విషయంలో తనను ఇబ్బంది పెట్టారని చెప్పారు. దీంతో ఆ ఫిల్మ్‌కు పనిచేసిన సముద్రఖని తాజాగా బహిరంగ లేఖ రాశారు. మరి.. నిర్మాతపై సముద్రఖని సీరియస్ అవ్వడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రజినీకాంత్ ను దాటేస్తున్న ఐకాన్ స్టార్! ఏ విషయంలో అంటే?
— P.samuthirakani (@thondankani) November 25, 2023