iDreamPost
android-app
ios-app

Samantha: చై అమాయకుడు.. ఎందుకు మోసం చేశావ్.. నెటిజన్ కి సామ్ స్ట్రాంగ్ కౌంటర్

  • Published Apr 10, 2024 | 11:04 AM Updated Updated Apr 10, 2024 | 1:19 PM

సోషల్ మీడియా వేదికగా తనను విమర్శించిన ఓ వ్యక్తికి సమంత గట్టిగా బుద్ది చెప్పారు. ఆ వివరాలు..

సోషల్ మీడియా వేదికగా తనను విమర్శించిన ఓ వ్యక్తికి సమంత గట్టిగా బుద్ది చెప్పారు. ఆ వివరాలు..

  • Published Apr 10, 2024 | 11:04 AMUpdated Apr 10, 2024 | 1:19 PM
Samantha: చై అమాయకుడు.. ఎందుకు మోసం చేశావ్.. నెటిజన్ కి సామ్ స్ట్రాంగ్ కౌంటర్

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్, విడాకులు వంటి విషయాలు కామన్. కానీ కొన్ని జంటలు విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ప్రేక్షకులు మాత్రం.. ఆ వార్తను జీర్ణించుకోలేరు. ప్రతి నిమిషం తలుచుకుని బాధపడుతుంటారు. అలాంటి జంటల్లో ఒకటి నాగచైతన్య-సమంత. టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్, లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మరి ఏం జరిగిందో తెలియదు.. అన్యోన్య దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్న వీరు సడెన్ గా విడాకులు తీసుకుని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు, జనాలకు కూడా భారీ షాక్ ఇచ్చారు.

ఇక వీరు విడాకులు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా అభిమానులు మాత్రం.. ఆ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సందర్భం వచ్చిన ప్రతి సారి వీరి విడాకులు గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి నాగచైతన్య-సమంత విడాకుల అంశం తెర మీదకు వచ్చింది.

Sam strong counter to netizen

ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా సమంతను కించపరుస్తూ పోస్ట్ చేశాడు. మా చై అమాయకుడు.. ఎందుకు మోసం చేశావ్ అని ప్రశ్నించాడు. అయితే అతడికి సామ్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు..

సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ వారిని విమర్శించడం ఆపడం లేదు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సామ్‌ ఆరోగ్యం గురించి తెలుపుతూ ఓ పాడ్‌కాస్ట్‌ వీడియో షేర్‌ చేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ఈ వీడియో గురించి మాట్లాడకుండా ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాడు. హద్దులు దాటి ప్రవర్తించాడు. అతడి తీరుపై సమంత గట్టిగానే స్పందించింది. ఇంతకు ఏం జరిగిందంటే..

ఈ వీడియో కింద ఓ నెటిజన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సమంతను ఉద్దేశించి ’’అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు‘‘ అనికామెంట్ చేశాడు. ఇది చూసిన సామ్‌.. ’’సారీ, ఇలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు. మీకింకా స్ట్రాంగ్‌ టెక్నిక్స్‌ కావాలి. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా‘‘ అని చెప్పడమే కాక.. చేతులు ఎత్తి నమస్కరిస్తున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్‌ బాగా బుద్ది చెప్పావ్.. నిన్ను కిందకు దిగజార్చాలనుకునే వారికి ఇలాగే ఇచ్చిపడేయ్‌.. ఎవరికీ అవకాశం ఇవ్వకు అని కామెంట్స్‌ చేస్తున్నారు.