iDreamPost
android-app
ios-app

Salaar: యూట్యూబ్​ను షేక్ చేస్తున్న ‘సలార్’.. టీజర్​లో ఈ మూడు విషయాలు గమనించారా?

  • Author singhj Published - 11:56 AM, Thu - 6 July 23
  • Author singhj Published - 11:56 AM, Thu - 6 July 23
Salaar: యూట్యూబ్​ను షేక్ చేస్తున్న ‘సలార్’.. టీజర్​లో ఈ మూడు విషయాలు గమనించారా?

ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్​ను షేక్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ మూవీనే ‘కేజీఎఫ్​’. కన్నడ సినిమా పవర్​ను చూపించిందీ చిత్రం. కమర్షియల్ మూవీకి ఈ ఫిలింతో కొత్త డెఫినిషన్ చెప్పాడు ప్రశాంత్ నీల్. సాధారణంగానే సౌత్ సినిమాల్లో హీరోలకు బాగా ఎలివేషన్స్ ఇస్తుంటారు. అలాంటిది ‘కేజీఎఫ్​’లో కథానాయకుడైన రాకీ పాత్రకు నీల్ ఇచ్చిన ఎలివేషన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్.. అంతా వేరే లెవల్ అని చెప్పాలి. ‘కేజీఎఫ్​’ ఒక్క కన్నడ నాటే కాదు.. తెలుగు, తమిళం, హిందీల్లోనూ బ్లాక్​ బస్టర్​గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్​ బాక్సాఫీస్ వద్ద ‘కేజీఎఫ్’ చేసిన సందడి అంతా ఇంతా కాదు.

‘కేజీఎఫ్​’తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ నుంచి తర్వాతి చిత్రం కోసం ఆడియెన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ మూవీ కోసం ఏకంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్​ను ఎంచుకున్నాడు ప్రశాంత్ నీల్. వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రమే ‘సలార్’. ఈ పాన్ ఇండియా మూవీ టీజర్​ కోసం ఆసక్తిగా ఎదురు చూసిన ఆడియెన్స్​ వెయిటింగ్​కు ఎట్టకేలకు తెరపడింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తూ ఇవాళ ఉదయం ‘సలార్’ టీజర్​ రిలీజైంది. యూట్యూబ్​ను ఈ టీజర్ ఇప్పుడు షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 ఆరు సెకన్ల పాటు ఉన్న ప్రభాస్ కొత్త మూవీ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సీక్వెన్సులతో నింపేశాడు ప్రశాంత్ నీల్. అయితే ఇందులో ప్రభాస్​ లుక్​ను పూర్తిగా చూపించలేదు. అయినా ఇంట్రడక్షన్, ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెప్పే డైలాగ్ సూపర్బ్​గా ఉన్నాయి.

‘సలార్’ టీజర్​లో మూడు విషయాలను గమనిస్తే అవి అచ్చం ‘కేజీఎఫ్​’లాగే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తన గత సినిమా మాదిరిగానే అదే దుమ్ము.. అదే బ్లాక్ బ్యాగ్రౌండ్​ను ఈ మూవీకి ఎంచుకున్నారని అర్థమవుతోంది. ‘కేజీఎఫ్​ 2’లో యష్ ఇంట్రడక్షన్ మాదిరిగానే ఇందులోనూ ఒక పెద్దాయనతో ఇంగ్లీష్​లో ప్రభాస్ ఇంట్రో డైలాగ్ ఉంటుంది. గత సినిమా ఫార్ములానే ఇక్కడ కూడా వాడేశారు నీల్. ఈ మూవీని కూడా ‘కేజీఎఫ్​’లానే రెండు పార్టులుగా తీయనున్నట్లు టీజర్ ఆఖర్లో క్లారిటీ ఇచ్చేశారు. ‘సలార్’ టీజర్​లో ప్రభాస్​ పూర్తి లుక్​ను కాకుండా కేవలం వెనుక నుంచి ఆయన పిడికిలిని మాత్రమే చూపించారు. ఇదంతా ‘కేజీఎఫ్​’ను పోలి ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘సలార్’ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి