iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న సలార్ టీమ్.. ఇంకో బర్త్ డే పోస్ట్ వైరల్!

  • Author ajaykrishna Published - 06:04 PM, Thu - 12 October 23
  • Author ajaykrishna Published - 06:04 PM, Thu - 12 October 23
ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న సలార్ టీమ్.. ఇంకో బర్త్ డే పోస్ట్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సలార్’. వీరి కాంబినేషన్ సెట్ అయినప్పటి నుండే సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పుడు రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండటంతో.. ఆ హైప్ కాస్త నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇప్పటికే సలార్ టీజర్ చూసి ఫ్యాన్స్ లో బీభత్సమైన ఎనర్జీ వచ్చేసింది. ఎందుకంటే.. కేజీఎఫ్ మూవీలో ప్రశాంత్ నీల్ టేకింగ్.. యాక్షన్ సీక్వెన్స్ లు.. సాలిడ్ మ్యూజిక్.. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్.. హీరో ఎలివేషన్స్ ఇవన్నీ జనాలకు మైండ్ లో సెటిల్ అయిపోయాయి. కేజీఎఫ్ తో యష్ ని పాన్ ఇండియా స్టార్ చేశాడు ప్రశాంత్.

అలాంటిది పాన్ ఇండియా స్టార్ తోనే సినిమా చేస్తే.. హీరోయిజం ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ టీజర్ చూసినప్పుడు బొమ్మ ఏ రేంజ్ లో ఉండబోతుందో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో.. సలార్ నుండి టీజర్ తప్ప ఎలాంటి అప్డేట్స్ లేవు. అయినా.. సినిమా రెగ్యులర్ గా ట్రెండింగ్ లో ఉంటోంది అంటే.. అర్ధం చేసుకోవచ్చు. ఆడియన్స్, ఫ్యాన్స్ సలార్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో. కేజీఎఫ్, కాంతార ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని నిర్మిస్తున్నారు. సలార్ కి కూడా కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్, కెమెరా మెన్ వర్క్ చేస్తుండటం విశేషం.

కట్ చేస్తే.. ఇటీవల సలార్ రిలీజ్ డేట్ తో ఫుల్ వైబ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా ఓ క్రేజీ పోస్టర్ వదిలి.. ఇంటరెస్ట్ పెంచేశారు. సీనియర్ నటుడు టిన్ను ఆనంద్.. సలార్ లో ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి టీజర్ తో తెలిసిందే. టీజర్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చి.. మైండ్ బ్లాక్ చేశాడు టిన్ను ఆనంద్. ఆయన బర్త్ డే సందర్బంగా విష్ చేస్తూ పోస్ట్ పెట్టారు సలార్ టీమ్. నటుడిగా టిన్ను ఆనంద్ గురించి ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. తెలుగులో అంజి, ఆదిత్య 369, నాయకుడు, పుష్పక విమానం, బాంబే, ఘటోత్కజుడు లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఇన్నాళ్లకు చాలా గ్యాప్ తర్వాత సలార్ లో కనిపించడం ఫ్యాన్స్ కి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇక సలార్ టీమ్ ఏం పెట్టిన ఫ్యాన్స్ లో హైప్ అయితే రెట్టింపు అవుతోంది. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş