Serial Actress: ఈ హీరోయిన్ తల్లి పాపులర్ తెలుగు సీరియల్ నటి.. ఎవరో తెలుసా?

ఈ హీరోయిన్ తల్లి పాపులర్ తెలుగు సీరియల్ నటి.. ఎవరో తెలుసా?

  • Author ajaykrishna Updated - 02:33 PM, Thu - 12 October 23
  • Author ajaykrishna Updated - 02:33 PM, Thu - 12 October 23
ఈ హీరోయిన్ తల్లి పాపులర్ తెలుగు సీరియల్ నటి.. ఎవరో తెలుసా?

ఆర్టిస్ట్ లకు సినిమా, సీరియల్ అనే తేడాలు ఉండవు. ఎందులో అవకాశం దొరికితే అందులో.. ఆ క్యారెక్టర్ లో పరకాయప్రవేశం చేసేస్తుంటారు. కెరీర్ లో కొందరు తమకంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని.. సీరియల్స్ వరకే పరిమితం అవుతుంటారు. మరికొందరు ఫామ్ లో ఉన్నప్పుడు సినిమాలు చేసి.. ఆ తర్వాత సీరియల్స్ లో అడుగు పెడుతుంటారు. ప్రస్తుతం సీరియల్ నటిగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న ఓ తెలుగు నటి.. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న హీరోయిన్ కి తల్లి. ఎవరో గుర్తు పట్టగలరా.. కూతురిని సినిమా హీరోయిన్ చేసి.. ఆ తల్లి ఇంకా సీరియల్స్ లోనే కొనసాగుతుంది.

రెగ్యులర్ గా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న రెండు సీరియల్స్ చేస్తోంది ఆ నటి. ఈ మధ్య పాపులర్ అయిన ఓ సీరియల్ లో శాడిస్ట్ అత్తగా కూడా పేరొందింది. కానీ.. కొడుకుపై ఎనలేని ప్రేమ చూపించే తల్లిగా కూడా మార్కులు కొట్టేసింది. ఈ రెండు షేడ్స్ లో నటిస్తున్న ఆమెకు.. పై పిక్ లో ఉన్న బ్యూటీ కూతురు. సరే మీకు కూతురు గురించి చెప్పి క్లూ ఇస్తా. పై ఫోటోలో ఉన్న హీరోయిన్ పేరు చరిష్మా శ్రీకర్. ఇప్పటిదాకా నీతోనే హాయ్ హాయ్.. ఆర్ యూ మ్యారీడ్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా రుద్రంగి అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈమె గురించి తెలిసింది కాబట్టి.. పోలికలు బట్టి.. తల్లి ఎవరో గుర్తు పట్టడానికి ట్రై చేయండి.

మీకు గుర్తు రాకపోతే.. ఇప్పుడు నేనే చెప్పేస్తా.. ఈ మధ్య తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న సీరియల్స్ లో ‘బ్రహ్మముడి’ ఒకటి. అందులో హీరో రాజ్ కి తల్లిగా నటిస్తున్న నటినే.. ఇప్పుడీ చరిష్మా శ్రీకర్ తల్లి. ఇప్పుడు ఫేస్ కట్ లో మైండ్ లో వెలిగిందా.. ఆమె పేరు శ్రీప్రియ. సీరియల్ లో అపర్ణ క్యారెక్టర్ చేస్తోంది. ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. మొగలిరేకులు సీరియల్ నుండి శ్రీప్రియ నటిగా ఎన్నో సీరియల్స్ కో కంటిన్యూ అవుతోంది. అయితే.. శ్రీప్రియ గురించి తెలిసినంతగా.. ప్రేక్షకులకు ఆమె కూతురు చరిష్మా గురించి తెలియదు. తల్లి సీరియల్స్ లో సత్తా చాటుతుంటే.. కూతురు సినిమాలలో రాణిస్తుంది. మరి శ్రీప్రియ, చరిష్మాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments