iDreamPost
android-app
ios-app

సలార్ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ! అనౌన్స్ చేసిన మేకర్స్!

  • Author ajaykrishna Published - 11:25 AM, Fri - 29 September 23
  • Author ajaykrishna Published - 11:25 AM, Fri - 29 September 23
సలార్ రిలీజ్ డేట్ పై ఫుల్ క్లారిటీ! అనౌన్స్ చేసిన మేకర్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ.. సలార్. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు సలార్ రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటికి రెండుసార్లు అనౌన్స్ చేసిన డేట్స్ నుండి వాయిదా పడింది. దీంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్ ని అందించారు మేకర్స్. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన సలార్ మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సింది. కానీ.. ఎందుకో గానీ ఫుల్ హైప్ క్రియేట్ అయ్యాక.. వాయిదా పడి నిరాశపరిచింది. కానీ.. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని మేకర్స్ ఇటీవల ధైర్యం ఇచ్చారు.

డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందిన మాస్ యాక్షన్ మూవీ సలార్.. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుందని తాజాగా మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేసేశారు. కొద్దిరోజులుగా సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అని సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. కానీ.. ఏదైనా మేకర్స్ క్లారిటీ ఇచ్చాకే కన్ఫర్మ్ అవుదాం అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో మేకర్స్.. డిసెంబర్ 22నే అని కన్ఫర్మ్ చేయడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా.. సలార్ ఈసారి క్రిస్మస్ టైమ్ ని క్యాష్ చేసుకోబోతుంది. ప్రభాస్ మాసీవ్ లుక్స్, టీజర్ ఆల్రెడీ సినిమాపై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లాయి.

దీంతో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అందరిలోనూ ఆసక్తి పీక్స్ కి చేరుకుంది. అసలు సలార్ లో ప్రభాస్ ని ఇంతవరకు ఎవరు చూపించని రేంజ్ లో.. వయిలెంట్ గా చూపించనున్నాడు ప్రశాంత్ నీల్. పైగా సినిమా కేజీఎఫ్ స్టోరీకి లింక్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సో.. నీల్ సినిమాటిక్ యూనివర్స్ లో సలార్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతిహాసన్ కీలకపాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు.. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి సలార్ రిలీజ్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomgrandpashabetgrandpashabetganobet