iDreamPost
android-app
ios-app

Salaar: 3వ రోజు అదే జోరు.. ఇప్పటి వరకు సలార్‌ కలెక్షన్‌ ఎంతంటే..

సలార్‌ సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో డిసెంబర్‌ 22న విడుదల అయింది. మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రెండు రోజుల్లోనే 295.7 కోట్లు కొల్లగొట్టింది.

సలార్‌ సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో డిసెంబర్‌ 22న విడుదల అయింది. మొదటి రోజు ఏకంగా 178 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. రెండు రోజుల్లోనే 295.7 కోట్లు కొల్లగొట్టింది.

Salaar: 3వ రోజు అదే జోరు.. ఇప్పటి వరకు సలార్‌ కలెక్షన్‌ ఎంతంటే..

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కేజీఎఫ్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ల ‘సలార్‌’ డిసెంబర్‌ 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ అయింది. ఇక, మొదటి రోజు ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 178 కోట్ల రూపాయలను కలెక్ట్‌ చేసింది. రెండవ రోజు కూడా సలార్‌ వేట కొనసాగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 కోట్లు వసూలు చేసింది.

రెండు రోజుల్లోనే అవలీలగా మూడు వందల కోట్ల రూపాయల మార్కుకు అతి చేరువలోకి వచ్చింది. 295.7  కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఇక, మూడవ రోజు కూడా డైనోసార్‌ విరుచుకుపడ్డాడు. మూడవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడు రోజుల్లోనే సలార్‌ 375 కోట్ల రూపాయల మార్కును చేరుకుంది. అయితే, సలార్‌కు పోటీగా విడుదల అయిన డంకీ మాత్రం కలెక్షన్ల విషయంలో బాగా వెనుకబడి పోయింది.

సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నాలుగు రోజుల్లో కేవలం 215 కోట్లను మాత్రమే కలెక్ట్‌ చేసింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత తగ్గే అవకాశం ఉంది. సలార్‌ మాత్రం 2023 సంవత్సరం పూర్తయ్యేలోగా.. 700-800 కోట్ల రూపాయల మార్కును చేరుకునే అవకాశం ఉంది. ఆదివారంతో పాటు ఇతర సెలవు దినాల్లో సలార్‌ కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కాగా, సలార్‌ సినిమాలో ‍ప్రభాస్‌కు జంటగా శృతిహాసన్‌ నటించారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఈ‍శ్వరీరావు, జగపతి బాబు, బాబీ సింహ, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

ఇద్దరు మిత్రుల కథగా సలార్‌ తెరకెక్కింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తన మొదటి సినిమా ‘ ఉగ్రం’ను రీమేక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. 2014లో విడుదలైన ఉగ్రం కథకు సరైన స్పందన రాలేదని అన్నారు. తన కథకు న్యాయం జరగాలన్న ఉద్ధేశ్యంతోనే మళ్లీ తీస్తున్నానని చెప్పారు. ప్రభాస్‌కు తగ్గట్టు మార్పులు చేసినట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికి సలార్‌ కథ మాత్రం ప్రభాస్‌కు ఓ బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను అందించింది.

దాదాపు 5 ఏళ్లుగా హిట్లు లేక అల్లాడుతున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌మీల్స్‌ పెట్టింది. సలార్‌ సూపర్‌ హిట్‌ అవ్వటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రశాంత్‌ నీల్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మరి, సలార్‌ సినిమా మూడు రోజుల్లోనే 375 కోట్ల రూపాయల వసూలు సాధించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.