Venkateswarlu
సలార్ మొదటి భాగం విడుదల అయి సంచలన విజయాన్ని నమోదు చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
సలార్ మొదటి భాగం విడుదల అయి సంచలన విజయాన్ని నమోదు చేసింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
Venkateswarlu
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంచనాలను మించి మొదటి రోజు 178 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు ఏకంగా 500 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది.
ఇక, సలార్ రెండు భాగాలుగా ఉండనుందన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ‘సలార్ : సీజ్ ఫైర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్ 2 : శౌర్యాంగా పర్వంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సలార్ 2కు సంబంధించి ఇంకా ఎటువంటి అఫిషియల్ అప్‌డేట్ లేదు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రశాంత్ నీల్ ఇప్పటికే రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. వాటిలో ఒకటి కేజీఎఫ్ 3 కాగా.. మరోటి జూనియర్ ఎన్టీఆర్‌తో తీయనున్నారు.
ఈ రెండిటి తర్వాతే సలార్ 2 మొదలవుతుందని టాక్ కూడా నడిచింది. కానీ, వీటన్నటికంటే ముందే సలార్ 2 షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక, సలార్ 2కు సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. సలార్ 1 నుంచి ఓ డైలాగ్ ప్రోమో విడుదల అయింది. ఆదివారం మధ్యాహ్నం హోంబళే ఫిల్మ్స్ ఈ వీడియోను విడుదల చేసింది. సలార్ డైలాగ్ ప్రోమో వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్ తెచ్చుకుంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే… ‘‘ ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ సిద్దమయ్యారు. ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగల బెట్టడానికి సిద్ధమయ్యారు. కానీ, దేవ అదే కుర్చీని వర్ధాకు ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ, దాని మీద కూర్చునే హక్కు. దేవాదే…. ’’ అన్న వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. ఇందులో శౌర్యాంగ పర్వం గురించిన ప్రస్తావన ఉంది. దానికి తోడు కుర్చీ దేవాదే అన్న మాట కూడా వినిపిస్తుంది. ఈ డైలాగ్ ప్రోమో సలార్ 2పై అంచనాలను పెంచేస్తోంది.
సీజ్ ఫైర్‌ను మించి శౌర్యాంగ పర్వం ఉండనుందని డైలాగ్ ప్రోమోను బట్టి చూస్తే తెలుస్తుంది. కాగా, సలార్ 2014లో వచ్చిన ఉగ్రం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్‌కు తగ్గట్టు ఉగ్రం కథలో మార్పులు చేసి మళ్లీ తీశారు. మరి, తాజాగా విడుదలైన సలార్ డైలాగ్ ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.