iDreamPost
android-app
ios-app

RRR & James : ఆర్ఆర్ఆర్ మీద పునీత్ ప్రభావం ఉంటుందా

  • Published Mar 23, 2022 | 4:58 PM Updated Updated Mar 23, 2022 | 4:58 PM
RRR & James : ఆర్ఆర్ఆర్ మీద పునీత్ ప్రభావం ఉంటుందా

ఇక్కడ పెద్దగా ఆడటం లేదు కానీ పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ కర్ణాటకలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కంటెంట్ ఎంత రొటీన్ గా ఉన్నా అభిమానులు ప్రజలు అతని వెండితెర కడచూపు దర్శనం కోసం థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు. ఫలితంగా వారం తిరక్కుండానే 100 కోట్లు గ్రాస్ ని అత్యంత వేగంగా సాధించిన శాండల్ వుడ్ మూవీగా జేమ్స్ చరిత్ర సృష్టించింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కెజిఎఫ్ 1 సైతం ఇంత ఈజీగా ఆ మార్కుని అందుకోలేదు. ఈ రన్ ఇంకా కొనసాగనుంది. అక్కడి జనం కథా కథనాలు అసలు పట్టించుకోవడం లేదు. పునీత్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు బరువెక్కిన హృదయంతో కంటతడితో చూస్తున్నారు.

అందుకే ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. శుక్రవారం ఆర్ఆర్ఆర్ వస్తున్న నేపథ్యంలో జేమ్స్ తీయకూడదనే డిమాండ్లు ఊపందుకున్నాయి. దర్శకుడు చేతన్ కుమార్ ఈ మేరకు ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఇంత మంచి ఆదరణ దక్కుతున్న టైంలో ఆర్ఆర్ఆర్ కోసం స్క్రీన్లు తగ్గించడం న్యాయం కాదని వాపోతున్నాడు. దీనికి పునీత్ అభిమాన సంఘాల మద్దతు దక్కుతోంది. ట్రిపులర్ కన్నడ వెర్షన్ ని నిర్లక్ష్యం చేస్తూ తక్కువ థియేటర్లు ఇచ్చారన్న కోపంతో ఉన్న కన్నడిగులు సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ ఆర్ఆర్ఆర్ అంటూ ట్రెండింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడిదాకా వెళ్తుందో అంతు చిక్కడం లేదు.

ఏది ఏమైనా జేమ్స్ కి అక్కడి ప్రజలు నిజమైన నివాళిని ఈ రూపంలో అందజేశారు. ఒకవేళ పునీత్ సజీవంగా ఉంటే హిట్ అయ్యేదేమో కానీ ఇంత పెద్ద ఘనతను అందుకునేది కాదు. జేమ్స్ ని కనీసం మూడు వారాల పాటు హోల్డ్ చేయాలని ఫ్యాన్స్ అసోసియేషన్లు డిస్ట్రిబ్యూటర్లను డిమాండ్ చేస్తున్నాయి. మెయిన్ సెంటర్స్ లో యాభై రోజులు ప్రదర్శించే ప్లాన్ కూడా ఉందట. ఇతర భాషల్లో మాత్రం కనీసం బ్రేక్ ఈవెన్ అందుకోలేకపోయిన ఈ మూవీకి కనీస వసూళ్లు దక్కాయంటే దానికి కారణం పునీత్ తెచ్చుకున్న మంచి పేరే. ఇప్పుడే ఇలా ఉంటే ఓటిటి, శాటిలైట్ లో వచ్చినప్పుడు జేమ్స్ ఎలాంటి బెంచ్ మార్క్ సెట్ చేస్తుందో

Also Read : Rama Rao On Duty : మాస్ మహారాజా టైమింగ్ బాగుంది