iDreamPost
android-app
ios-app

Prabhas: తిరగబెట్టిన గాయం, ప్రభాస్ కి మరోసారి సర్జరీ? కల్కి వాయిదా?

  • Published Jan 19, 2024 | 1:45 PM Updated Updated Jan 19, 2024 | 3:18 PM

ఇటీవల సలార్ సినిమాతో అభిమానుల ఆకలి తీర్చిన రెబల్ స్టార్.. మరి కొద్దీ నెలల్లో మరొక సినిమాతో ముందుకురానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన కల్కి చిత్రం మే 9న విడుదల అవ్వనుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడు సామజిక మాధ్యమాలలో వినిపించే వార్తలు చూస్తుంటే కల్కి విడుదల సమయం కాస్త ఆలస్యం అయ్యేలానే ఉంది.

ఇటీవల సలార్ సినిమాతో అభిమానుల ఆకలి తీర్చిన రెబల్ స్టార్.. మరి కొద్దీ నెలల్లో మరొక సినిమాతో ముందుకురానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటించిన కల్కి చిత్రం మే 9న విడుదల అవ్వనుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఇప్పుడు సామజిక మాధ్యమాలలో వినిపించే వార్తలు చూస్తుంటే కల్కి విడుదల సమయం కాస్త ఆలస్యం అయ్యేలానే ఉంది.

  • Published Jan 19, 2024 | 1:45 PMUpdated Jan 19, 2024 | 3:18 PM
Prabhas: తిరగబెట్టిన గాయం, ప్రభాస్ కి మరోసారి సర్జరీ? కల్కి వాయిదా?

ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత.. అది కూడా ఎటువంటి హడావిడి లేకుండా.. థియేటర్లలో విడుదల అయ్యి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సమయంలో ప్రభాస్ అభిమానులు చేసిన సందడి అంత ఇంత కాదు. ఇంకా సలార్ ఇచ్చిన కిక్ నుంచి తేరుకోకముందే.. కల్కి సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి.. వారి ఆనందాన్ని రెట్టింపు చేశాడు. అది కాకుండా రీసెంట్ గా రాజా సాబ్ పోస్టర్ తో మరొక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంకా ప్రభాస్ అభిమానులు డార్లింగ్ చిత్రాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించే టాక్ చూస్తుంటే మాత్రం. కల్కి సినిమా విడుదల కాస్త ఆలస్యం అవుతుందేమో అనే సందేహాలు అందరికి మొదలవుతున్నాయి.

సినిమాల్లో డార్లింగ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో చిత్రాలు విడుదల తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉన్నా సరే.. ప్రభాస్ మాత్రం తన క్యారక్టర్ కు వంద శాతం న్యాయం చేస్తాడని.. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా చూస్తే.. ప్రభాస్ రెండు పాత్రలలో వేరియేషన్స్ కోసం ఎంత కష్టపడ్డాడో కనిపిస్తోంది. వెండితెరపైన ఎంతో అద్భుతంగా పేరుకు తగినట్టు బాహుబలిలా కనిపించిన ప్రభాస్.. తేర వెనుక దానికోసం ఎంతో కష్టపడ్డాడు. గంటల తరబడి జిమ్ లో వ్యాయామాలు చేసేవాడు. అయితే, ఆ ప్రక్రియలో ప్రభాస్ కి మోకాలి నొప్పి సమస్య మొదలైందట. చాలా కాలంగా ఈ నొప్పి డార్లింగ్ ను వేధించడంతో.. వైద్యుల సలహా మేరకు.. గత ఏడాది విదేశాల్లో సర్జరీ చేయించుకున్నాడు. ఒక నెల రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని.. సలార్ విడుదలకు ముందే ఇండియాకు వచ్చాడు . అందువలనే ప్రభాస్ సలార్ కు సంబధించిన ఏ ప్రమోషన్స్ లో కనిపించలేదనే టాక్ కూడా వినిపించింది.

అయితే, ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 AD, రాజా సాబ్ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటునట్టు సమాచారం. ఈ క్రమంలో ప్రభాస్ మోకాలి గాయం తిరగబెట్టిందట. దీనితో మరోసారి సర్జరీ తప్పదంటూ.. దానికోసం ప్రభాస్ విదేశాలకు వెళ్తున్నాడంటూ.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే కల్కి చిత్రం సంక్రాంతి కానుకగా రావలసి ఉంది. కానీ, దానిని సమ్మర్ లో విడుదల చేసేందుకు వాయిదా వేశారు మేకర్స్. మరి, ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు కనుక నిజమైతే.. మే 9 న విడుదల కావాల్సిన కల్కి మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.