Krishna Kowshik
నాలుగు నెలలు గడిచాయో లేదో ఇండియన్ ఇండస్ట్రీ .. పలువురు సినీ దిగ్గజాలను కోల్పోయింది. సీనియర్ నటుల నుండి యంగ్ టాలెంట్స్ వరకు ఎంతో మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మరో దర్శకుడు కన్నుమూశారు.
నాలుగు నెలలు గడిచాయో లేదో ఇండియన్ ఇండస్ట్రీ .. పలువురు సినీ దిగ్గజాలను కోల్పోయింది. సీనియర్ నటుల నుండి యంగ్ టాలెంట్స్ వరకు ఎంతో మంది మృత్యువాత పడ్డారు. తాజాగా మరో దర్శకుడు కన్నుమూశారు.
Krishna Kowshik
పట్టుమని నాలుగు నెలలు పూర్తయ్యయో.. లేదో ఇండస్ట్రీలో వరుస విషాదాలు నెలకొన్నాయి. సినీ దిగ్గజాలు ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు. కమెడియన్స్, సింగర్, విలన్స్, ప్రముఖ సినీ రైటర్స్ అండ్ టెక్నీషియన్స్ మరణించారు. ప్రముఖ కోలీవుడ్, టాలీవుడ్ కమెడియన్స్ లొల్లు సభ శేషు, గరిమెళ్ల విశ్వేశ్వరరావు, సినీ రైటర్ శ్రీ రామకృష్ణ, క్యారెక్టర్ ఆర్టిస్టు వీర భద్రరరావు, అలాగే పాపులర్ విలన్ డేనియల్ బాలాజీ వరుసగా మృతి చెందిన సంగతి విదితమే. కాగా, తాజాగా ప్రముఖ సింగర్ ఉమా రామనన్, ప్రముఖ హీరోయిన్ అమృత పాండే, కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తాజాగా ప్రముఖ దర్శకుడు మృత్యువాత పడ్డారు.
మాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, కథా రచయిత హరి కుమార్ క్యాన్సర్‌తో కన్నుమూశారు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మరణించారు. ఆయన మరణ వార్తతో కేరళ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తన కలంతో 20కి పైగా చిత్రాలకు స్క్రీన్ ప్లే, స్టోరీ, డైలాగ్స్ అందించారు. కమర్షియల్ చిత్రాలకే కాకుండా కళాత్మక చిత్రాలను అందించి సక్సెస్ అందుకున్నాడు. సాహితీ వేత్తల దర్శకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. 1981లో విడుదలైన అంబళ పూవు చిత్రంతో డైరెక్టర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించారు హరి కుమార్. సుకృతం అనే మూవీ ఉత్తమ మలయాళం చిత్రం కేటగిరిలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఇందులో మమ్ముట్టి, గౌతమి హీరో హీరోయిన్లుగా నటించారు.
స్వయంవర పంథాల్‌తో పాటుగా జలకం, ఉజం, అయనం, ఉద్యాన పాలకన్, పులి వానినే పులి, పులర్వెట్టం, పురంజు తీర్థ విశేషంజల్, సద్గమయ, క్లైంట్ వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 2022లో విడుదలైన ఆటో రిక్షాకారంటే భార్య అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే ఆయనకు చివరి సినిమా. 40 సంవత్సరాల వ్యవధిలో ఆయన ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందించారు. 2005 నుండి 2008లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ సభ్యునిగా కూడా పనిచేశారు హరి కుమార్. కేవలం దర్శకుడిగానే కాకుండా పలు సినిమాలకు స్టోరీని అందించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. ఆయన మృతి వార్తతో మాలీవుడ్ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగి తేలిపోయింది. ఆయన మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం వ్యక్త పరిచారు. పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.