Krishna Kowshik
మలయాళ ఇండస్ట్రీ నుండి సత్తా చాటుతున్న నటీమణుల్లో ఒకరు పూర్ణ. ఆమె అసలు పేరు సామ్నా కాసిం. మలయాళంతో పాటు సౌత్ సినిమాల్లో నటించింది. ఇటీవల వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఈ భామ. . వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. మొన్న గుంటూరు కారంలో కూడా ఆడిపాడిన సంగతి విదితమే.
మలయాళ ఇండస్ట్రీ నుండి సత్తా చాటుతున్న నటీమణుల్లో ఒకరు పూర్ణ. ఆమె అసలు పేరు సామ్నా కాసిం. మలయాళంతో పాటు సౌత్ సినిమాల్లో నటించింది. ఇటీవల వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఈ భామ. . వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. మొన్న గుంటూరు కారంలో కూడా ఆడిపాడిన సంగతి విదితమే.
Krishna Kowshik
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెప్పిస్తోన్న మలయాళ బ్యూటీ పూర్ణ. అసలు పేరు షామ్నా కాసిం. తెలుగులో శ్రీ మహాలక్ష్మి మూవీతో ఎంటర్ అయిన ఈ భామ. నరేష్ తో సీమ టపాకాయి, లడ్డు బాబు వంటి చిత్రాలు చేసింది. కానీ ఆమెకు పేరు తెచ్చింది మాత్రం అవును వంటి హారర్ సిరీస్సే. అవును 2, రాజు గారి గది, రాక్షసి వంటి చిత్రాల్లో అలరించింది. ఆ మధ్య నెగిటివ్ క్యారెక్టర్‌లో కూడా కట్టిపడేసిన సంగతి విదితమే. అటు టీవీ షోల్లోనూ సందడి చేస్తూ ఉంటుంది. కాగా, ఆమె దుబాయ్‌కు చెందిన వ్యాపార వేత్తను వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారుతోంది పూర్ణ. డెవిల్ మూవీతో మళ్లీ ముందుకు రాబోతుంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు మిష్కిన్. మూగ మూడి (తెలుగులో మాస్క్) చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకున్నప్పటికీ.. గుర్తింపు వచ్చింది మాత్రం డిటెక్టివ్ (తుప్పరివాలన్), సూపర్ డీలక్స్‌తోనే. డిఫరెంట్ కథలను తెరకెక్కిస్తుంటాడు ఈ దర్శకుడు. ఆ తర్వాత సైకో వంటి చిత్రాలు తెరకెక్కించాడు. ఇప్పుడు రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఆయన సోదరుడు కూడా డైరెక్టర్‌గా మారి గతంలో సవరకత్తి అనే మూవీని తెరకెక్కించాడు. ఇప్పుడు మరో చిత్రంతో ముందుకు వస్తున్నాడు. అదే డెవిల్. విదార్థ్, పూర్ణ, త్రిగుణ్, మిష్కిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు మిష్కిన్ తొలిసారిగా సంగీతం అందించడం విశేషం. హర్రర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ.. డెవిల్ తనకు కేవలం సినిమా మాత్రమే కాదని, తన జీవితానికి రిలేటెడ్‌గా ఓ ఎమోషన్ అని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ తనకు సినిమా అంటే పిచ్చి అని.. సినిమాలో నిజాయితీ అవసరమని, అది మిష్కిన్ నుండి నేర్చుకున్నానని అన్నారు. అలాగే సంగీత దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పూర్ణ అద్భుతంగా నటించిందని, అయితే తమ మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టిస్తున్నారని అది అంతా అవాస్తమని పేర్కొన్నారు. నిజానికి ఆమె తనకు తల్లిలాంటి వారని, అమ్మే అంటూ.. వచ్చే జన్మంటూ ఉంటే.. ఆమె కడుపున పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన మాటలు విని పూర్ణ భావోద్వేగానికి లోనై.. కన్నీటి పర్యంతం అయ్యారు. నటి పూర్ణ విషయానికి వస్తే ఇటీవల గుంటూరు కారంలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన సంగతి విదితమే.