iDreamPost
iDreamPost
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. చరణ్ గెటప్ తాలూకు కొన్ని లీకులు బయటికి రావడంతో అలెర్ట్ అయిన టీమ్ వెంటనే వాటిని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా చేయబోతున్నట్టు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగా తిరుగుతోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం అది నిజమేనట. ఒక పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ కోసం సూర్యని సంప్రదిస్తే వెంటనే ఓకే చెప్పినట్టు తెలిసింది.
దీనికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. ఎస్ జె సూర్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనిపిస్తారట.. ఎలక్షన్ ఆఫీసర్ గా నటించే చరణ్ కు తనకు మధ్య ఉన్న సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని వినికిడి. ఒకే ఒక్కడులో అర్జున్ రఘువరన్ ల మధ్య అద్భుతంగా పేలిన ఎపిసోడ్లను మించి ఇందులో కొత్తగా ప్లాన్ చేశారట. అన్యాయానికి అవినీతికి తిరగబడిన క్యారెక్టర్ లో చరణ్ కొత్తగా ఉంటాడని అంటున్నారు. డ్యూయల్ రోల్ వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి కానీ ఇంకా క్లారిటీ రావాలి. 2023 సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణలో ఎలాంటి జాప్యం లేకుండా శంకర్ చూసుకుంటున్నారు.
వినయ విధేయ రామ తర్వాత మూడేళ్ళకు పైగా గ్యాప్ వస్తున్న రామ్ చరణ్ లైనప్ ఈసారి చాలా ఇంటరెస్టింగ్ గా ఉంది. మార్చ్ 25న ఆర్ఆర్ఆర్ వస్తుంది. నెల తిరక్కుండానే ఏప్రిల్ 28 ఆచార్యతో పాటు కలిసి వస్తాడు. ఆపై ఎనిమిది నెలల గ్యాప్ తో ఈ మూవీ విడుదలవుతుంది. నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి, ప్రశాంత్ నీల్, సుకుమార్ లు లైన్ లో ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ కి ఏదీ తగ్గడం లేదు. అంతా బాగానే ఉంది కానీ మహేష్ బాబు స్పైడర్ లో విలన్ గా నటించి ఫ్లాప్ మూటగట్టుకున్న ఎస్ జె సూర్య ఇప్పుడీ చరణ్ మూవీతోనైనా బిగ్ బ్రేక్ అందుకుంటాడో లేదో చూడాలి. రెమ్యునరేషన్ భారీగా ముట్టజెప్పారట
Also Read : Bheemla Nayak : పవన్ సినిమా 100 కోట్ల మార్కు అందుకోగలదా