iDreamPost
iDreamPost
ఇంకో రెండే రోజుల్లో భీమ్లా నాయక్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. నైజామ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఆన్ లైన్ లో పెట్టిన టికెట్లన్నీ దాదాపు తొంభై శాతానికి పైగానే బుక్ అయినట్టు ట్రేడ్ రిపోర్ట్. బ్యాలన్స్ ఉన్నవి కూడా రేపు మొదటి షో పడే లోపే హౌస్ ఫుల్ అయిపోతాయి. తెలంగాణ ఇచ్చిన జిఓను వాడుకుని మల్టీ ప్లెక్సులు, సింగల్ స్క్రీన్లు గరిష్ట ధరకు వెళ్లడంతో ఫస్ట్ డే మాత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు నమోదయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏపిలో కొత్త జిఓ వస్తుందేమోననే నమ్మకంతో ఇంకా చాలా చోట్ల టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టలేదు. ఇవాళ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ ఎలాంటి ఉత్తర్వులు రాకపోతే పాత రేట్లకే అమ్మకాలు కొనసాగించాల్సి ఉంటుంది. ఇక బిజినెస్ లెక్కల విషయానికి వస్తే భీమ్లా నాయక్ టార్గెట్ కనీసం 107 కోట్ల దాకా ఉండబోతోంది. నైజామ్ ఏకంగా 35 కోట్లు పలకగా సీడెడ్ ని 16 కోట్ల 30 లక్షల దాకా డీల్ చేశారు. ఉత్తరాంధ్ర 9 కోట్లు, ఈస్ట్ వెస్ట్ కలిపి 11 కోట్ల 75 లక్షలు, గుంటూరు 7 కోట్ల 15 లక్షలు, కృష్ణా 6 కోట్లు, నెల్లూరు 3 కోట్ల 20 లక్షలు ఇలా తెలుగు రాష్ట్రాలకు సుమారు 88 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేశారని సమాచారం. రెస్ట్ అఫ్ ఇండియా 9 కోట్ల దాకా పలికితే ఓవర్సీస్ ని అంతే మొత్తంలో అంటే 9 కోట్లకు ఇచ్చేశారు. వరల్డ్ వైడ్ ఈ లెక్క 106 కోట్లు దాటేసింది.
ఇప్పుడున్న హైప్ కి కాంపిటీషన్ లేని అడ్వాంటేజ్ ని కనక సరిగ్గా వాడుకుంటే భీమ్లాకు ఈ 107 కోట్లను రాబట్టుకోడం పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే ఓవర్సీస్ లో వలిమైకు వచ్చే రెస్పాన్స్ కీలకంగా మారుతుంది. కర్ణాటకలోనూ అంతే. మలయాళం రీమేక్ కావడంతో కేరళలో రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. హిందీ వెర్షన్ కూడా ఏవో కారణాల వల్ల అదే రోజు రావడం లేదని అంటున్నారు కానీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. వకీల్ సాబ్ కన్నా పదిహేను కోట్లకు పైగా అదనంగా టార్గెట్ పెట్టుకున్న భీమ్లా నాయక్ తెల్లవారుఝాము షోలు ఉదయం 4 నుంచి 7 మధ్యలో ప్రారంభం కాబోతున్నాయట. చూద్దాం నాయక్ ఏం చేస్తాడో
Also Read : Valimai : అజిత్ ఇక్కడ జెండా పాతగలరా