iDreamPost
android-app
ios-app

ఆ దర్శకుడు రవితేజని మరోసారి గట్టెక్కిస్తాడా?

  • Published Nov 11, 2023 | 3:31 PM Updated Updated Nov 11, 2023 | 6:53 PM

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. ఈ ఏడాదిలో వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాల్లో సందడి చేశారు. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాపీసు వద్ద బోల్తా కొట్టాయి.

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాస్ మహారాజాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. ఈ ఏడాదిలో వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాల్లో సందడి చేశారు. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాపీసు వద్ద బోల్తా కొట్టాయి.

  • Published Nov 11, 2023 | 3:31 PMUpdated Nov 11, 2023 | 6:53 PM
ఆ దర్శకుడు రవితేజని మరోసారి గట్టెక్కిస్తాడా?

మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఈజీ గోయింగ్ నటనతో కట్టిపడేస్తుంటారు. స్మాల్ రోల్స్ నుండి స్టార్ ఇమేజ్‌‍కు చేరుకున్నారు. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ప్రయోగాలంటే ఎక్కువ ఇష్టపడే రవితేజ.. ఆ దిశగా మూవీస్ చేస్తుంటే.. బాక్సా ఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ ఏడాదిలో వాల్తేరు వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాల్లో సందడి చేశారు. వాల్తేరు వీరయ్య మినహాయించి మిగిలిన రెండు సినిమాలు అభిమానుల్ని నిరాశ పర్చాయనే చెప్పొచ్చు. దీని బట్టి చూస్తే.. రవితేజ నుండి అభిమానులు ఇంకేదో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అర్థమౌతుంది.

రవితేజకు ప్రతిసారి ప్లాపులు ఎదురైనప్పుడల్లా బౌన్స్ బ్యాక్ హిట్స్ అందిస్తున్నాడు స్టార్ దర్శకుడు గోపిచంద్ మలినేని. శంభో శివ శంభో తర్వాత కెరీర్ గాడి తప్పుతున్న సమయంలో డాన్ శీను రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు గోపిచంద్. రవితేజలో ఉన్న మాసిజాన్ని తెరపై చూపించడంతో తొలి సినిమాతోనే సక్సెస్ అయ్యాడు గోపి. ఈ మూవీతో మాస్ మహారాజాగా నేమ్, ఫేమ్ వచ్చింది రవికి. ఆతర్వాత సారొచ్చారు, డిస్కో రాజా రూపంలో ఫెయిల్యూర్స్ రాగా, బలుపు వంటి బంఫర్ హిట్ అందించాడు దర్శకుడు. ఇలా వీరిద్దరి కాంబోలో సినిమాలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఆ అంచనాలు తారుమారు చేయకుండా క్రాక్ మూవీ రూపంలో మరో బ్లాక్ బస్టర్ పడింది. ఈ సినిమాతో కేవలం రవికే కాదూ.. అందరికీ పేరు వచ్చింది.

ఇప్పుడు రావణాసుర, పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు ఫెయిల్యూర్స్ రవితేజ ఇమేజ్ పై ప్రభావితం చేస్తున్నాయి అనుకున్న సమయంలో ఈ కాంబో మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. రవితేజ ట్రాక్ మారుతున్నప్పుడుల్లా.. ఆ లెక్కలు సరి చేస్తున్నాడు గోపిచంద్. ఎందుకంటే.. గోపిచంద్ కు దర్శకుడిగా మొదటి అవకాశాన్ని ఇచ్చింది రవితేజనే. డాన్ శ్రీను, బలుపు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్‍గా మారాడు. అందుకే రవితేజ రుణం తీర్చుకునేందుకు.. ఎప్పటికప్పుడు ఆయనతో సినిమాలు చేస్తూ.. మళ్లీ అతడిని సక్సెస్ వేలో పరుగులు పెట్టిస్తున్నాడు. వీరి కాంబోలో నాల్గో సినిమా వస్తుందంటే.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మళ్లీ రవిలో ఉన్న మాస్ తెరపై కనిపించబోతుందని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom