Aditya N
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఆమె ఫ్యాన్స్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. టోక్యోలో రష్మిక మందన్నకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇది చూసిన వారు శ్రీవల్లి క్రేజ్ అదరహో అంటున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ఆమె ఫ్యాన్స్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. టోక్యోలో రష్మిక మందన్నకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇది చూసిన వారు శ్రీవల్లి క్రేజ్ అదరహో అంటున్నారు.
Aditya N
జపాన్ లోని టోక్యోలో రష్మిక మందన్నకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక అవార్డ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు జపాన్ లో అడుగు పెట్టారు. పుష్ప ది రైజ్ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో ప్రేక్షకులని అలరించిన రష్మిక తాజాగా మిలాన్లో గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో కొత్త వీడియోలో చూపించారు. ఇది చూసిన అందరూ శ్రీవల్లి క్రేజ్ అదరహో అంటున్నారు.
ఇటీవలే ఫిబ్రవరి 21న జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్లో తన అంతర్జాతీయ మోడలింగ్ అరంగేట్రంలోని హైలైట్స్ కలిగిన వీడియోను రష్మిక గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ రోజు టోక్యో చేరుకున్న ఆమె వెంటనే తన హోటల్ గది నుంచి తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. తరచూ తన ప్రయాణాల గురించి పోస్ట్ చేస్తూ ఫొటోలు, సెల్ఫీలు పోస్ట్ చేయడం రష్మికకు అలవాటు. 2024 మార్చి 2న జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది.
ఛలో, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్స్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు. గత రెండు మూడేళ్లలో ఆమె నటించిన సినిమాలు చూస్తే పుష్ప, సీతా రామం, యానిమల్ ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలలో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నారు. కాగా యానిమల్ సినిమాకి నటనకు గానూ రష్మికకు ఫిల్మ్ ఫేర్ అవార్డు రాకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్నారు. ఇక రష్మిక నటించే తదుపరి సినిమాల విషయానికి వస్తే… పుష్ప 2: ది రూల్, రెయిన్బో, ది గర్ల్ఫ్రెండ్ అనే మూడు తెలుగు చిత్రాల్లో నటించనున్నారు. కాగా బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా “ఛావా”లో కూడా విక్కీ కౌశల్ సరసన రష్మిక నటించనున్నారు. పైన చెప్పుకున్న విధంగా మార్చి 2న జరగనున్న క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ ఎనిమిదో ఎడిషన్లో పాల్గొనేందుకు ఆమె ఇటీవల టోక్యోలో అడుగుపెట్టారు.
#RashmikaMandanna was warmly welcomed by her fans in Tokyo, Japan. pic.twitter.com/ainaM9mH5J
— Gulte (@GulteOfficial) March 1, 2024