Swetha
సినీ ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన ఓ స్టార్ హీరోయిన్ .. చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరై ఉంటారు.
సినీ ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన ఓ స్టార్ హీరోయిన్ .. చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరై ఉంటారు.
Swetha
అందం, అభినయం ఆమె సొత్తు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటన తనది. సినిమాలలో ఆ క్యారక్టర్ ను ఎవరి కోసం రాసినా కానీ.. ఒక్క సారి ఈమె నటించిందంటే.. ఈమె కోసమే ఆ పాత్ర రాశారా అన్నట్లుగా అనిపిస్తోంది అందరికి. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా.. చక్రం తిప్పిన ఈ భామ. ఇప్పటికి కూడా సినిమాలలో తన నటనతో తన రేంజ్ ఏంటో నిరూపించుకుంటూనే ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, రాజశేఖర్, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో జత కట్టిన ఈ భామ.. ఆ సమయంలో ఎందరో కుర్రాళ్లకు డ్రీం బ్యూటీగా నిలించింది. ఇప్పటికి కూడా పాన్ ఇండియా స్టార్స్ తో.. స్క్రీన్ షేర్ చేసుకుంటూ.. తనదైన గుర్తింపును సంపాదించుకుంటుంది. సినిమాలలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమయంలోనే.. విలన్ పాత్రలను కూడా పోషించి.. తనదైన ముద్రను ఆ క్యారెక్టర్స్ కు వేశారు. ఇప్పటికి కూడా వరుస సినిమాలతో ఆమె బిజీ బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.. ఈ అమ్మడు ఎంతో మంది సినీ ప్రేక్షకులకు ఇష్టమైన నటి. డ్యాన్సర్ గా ఇండస్ట్రీలో తన కెరీర్ ను ప్రారంభించి .. చిన్న వయస్సులోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు.. కన్నడ, హింది, మలయాళం, తమిళం భాషల్లో కూడా నటించి .. తనదైన గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా ఆమె నటనలో అందరికి నచ్చేవి ఆమె కళ్ళు. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్స్ పలికించగల టాలెంట్ కేవలం ఆమెకు మాత్రమే ఉందని చెప్పి తీరాలి. హీరోయిన్ గా నటించిన ఆమె.. తర్వాత తర్వాత అమ్మ పాత్రలు, దేవత పాత్రలు నటించేది. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ శివగామి “రమ్య కృష్ణ”. రమ్య కృష్ణ కెరీర్ లోనే బాహుబలి శివగామి పాత్ర ఆమె నటించిన అత్యతద్భుతమైన పాత్రలలో ఒకటిగా నిలిచిపోతుంది. అలాగే రజినీకాంత్ కు జోడిగా నటించిన “నరసింహ” లోని పాత్ర కూడా ఆమె నటించిన బలమైన పాత్రలలో ఒకటి. హీరోయిన్ గా, విల్లన్ గా రాణించిన ఆమె.. తన సెకండ్ ఇన్నింగ్స్ లోను వరుస సినిమాలతో బిజీగానే ఉంది.
రమ్య కృష్ణ.. సెప్టెంబర్ 15, 1967లో చెన్నైలో జన్మించారు. ఆమె తన చిన్నతనం నుంచి భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నారు. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమె.. సినీ రంగ ప్రవేశం చేశారు. 1985లో భలే మిత్రులు సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు రమ్యకృష్ణ. ఆ తర్వాత సూత్రదారులు సినిమాలో ఆమె నటించారు. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు కొన్నాళ్ల పాటు ఎటువంటి ఆఫర్లు రాలేదు. కానీ, 1992లో వచ్చిన అల్లుడుగారు సినిమాతో రమ్య కృష్ణ సినీ కెరీర్ .. ఊహించిన మలుపు తిరిగి.. ఆరోజు నుంచి ఈరోజు వరకు .. మళ్ళీ వెనుకకు తిరిగి చూసుకోనివ్వకుండా చేసింది.పైగా, రమ్య కృష్ణ ఎక్కువగా రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే సినిమాలను తీసేవారు. దాదాపు 1990 నుంచి 2000 వరకు.. సినీ ఇండస్ట్రీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో.. కలిపి 200 కు పైగా సినిమాలలో నటించి.. ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రను వేసుకున్నారు రమ్య కృష్ణ.