iDreamPost
android-app
ios-app

రంగ స్థలం కాంబో రిపీట్.. ఆ రోజే ప్రకటిస్తారా..?

  • Published Mar 21, 2024 | 3:16 PM Updated Updated Mar 21, 2024 | 3:16 PM

తెలుగు తెరపై క్లాసిక్ చిత్రాల లిస్ట్ తీస్తే.. అందులో కచ్చితంగా ఉంటుంది రంగ స్థలం.. చిట్టిబాబు నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్ . లెక్కల మాస్టారు.. ఈ సినిమాతో మ్యాజిక్ చేసేశాడు. అయితే ఇప్పుడో చరణ్ అభిమానులు ఎగిరి గంతేసేలా ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

తెలుగు తెరపై క్లాసిక్ చిత్రాల లిస్ట్ తీస్తే.. అందులో కచ్చితంగా ఉంటుంది రంగ స్థలం.. చిట్టిబాబు నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్ . లెక్కల మాస్టారు.. ఈ సినిమాతో మ్యాజిక్ చేసేశాడు. అయితే ఇప్పుడో చరణ్ అభిమానులు ఎగిరి గంతేసేలా ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

  • Published Mar 21, 2024 | 3:16 PMUpdated Mar 21, 2024 | 3:16 PM
రంగ స్థలం కాంబో రిపీట్.. ఆ రోజే ప్రకటిస్తారా..?

రామ్ చరణ్ ది బెస్ట్ చిత్రాల్లో ఒకటి రంగ స్థలం. చిట్టి బాబు పాత్రలో చెవిటి వ్యక్తిగా చెర్రీ యాక్టింగ్ న భూతో న భవిష్యతి అని చెప్పాలి. ఈ మూవీ ఓ ఆణిముత్యం. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. లెక్కల మాస్టారు సుకుమార్ కథ, దర్శకత్వం వహించిన రంగ స్థలం క్లాసిక్ చిత్రంగా గుర్తిండిపోతుంది. సమంత, ఆది పిని శెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. 2018లో రిలీజైన ఈ పిక్చర్  బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. కాగా, రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అటు సుక్కు కూడా పుష్ప 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ నెటింట్లో చక్కర్లు కొడుతుంది. రంగ స్థలం కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వబోతుందట.

లెక్కల మాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా ప్రకటన ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు జరిగాయని, నిర్మాణ సంస్థ కూడా ఫిక్స్ అయ్యిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చిట్టి బాబు, సుక్కు మరోసారి రంగస్థలాన్ని మించిపోయే ప్రాజెక్ట్ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది. ఇది కనుక నిజమైతే.. ఫ్యాన్స్‌కు పండుగే. ప్రస్తుతం ఆర్ సి 17 హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. రంగ స్థలాన్ని తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను కూడా నిర్మించనున్నారని టాక్.

ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ సెట్స్ పై ఉంది. పుట్టిన రోజు నాడు.. అప్పుడెప్పటి నుండో ఊరిస్తున్న ‘జరుగు.. జరుగు’ సాంగ్ విడుదల కాబోతుందట. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో రాబోతున్న ఆర్ సీ 16 నిన్ననే పూజా కార్యక్రమాలు నిర్వహించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ఆ రోజు రిలీజ్ చేయోచ్చు కూడా. ఆల్మోస్ట్ శంకర్ పిక్చర్ పూర్తి అయిపోతున్నందున.. బుచ్చిబాబు ప్రాజెక్ట్ కూడా ఫాస్ట్‌గా పూర్తి చేసి.. ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. ఇక పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్‪గా మారిన సుకుమార్.. దీనికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టులో 15న విడుదల చేయాలని భావిస్తున్నాడు. దీని తర్వాత రామ్ చరణ్ మూవీకి షిఫ్ట్ అవుతాడట. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ గురించి తెలియాలంటే మార్చి 27 వరకు ఆగాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom