iDreamPost
android-app
ios-app

Ram Charan: మెగా లిటిల్ ప్రిన్స్ క్లిన్ కార ఫేస్ స్పష్టంగా రివీల్.. అచ్చం నాన్న పోలికే!

  • Published Mar 20, 2024 | 10:49 AM Updated Updated Mar 20, 2024 | 10:49 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​-ఉపాసన దంపతుల గారాలపట్టి క్లిన్ కారను చూడాలని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు క్లిన్ కార ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ ఎందులోనూ ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్తలు పడ్డారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​-ఉపాసన దంపతుల గారాలపట్టి క్లిన్ కారను చూడాలని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు క్లిన్ కార ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ ఎందులోనూ ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్తలు పడ్డారు.

  • Published Mar 20, 2024 | 10:49 AMUpdated Mar 20, 2024 | 10:49 AM
Ram Charan: మెగా లిటిల్ ప్రిన్స్ క్లిన్ కార ఫేస్ స్పష్టంగా రివీల్.. అచ్చం నాన్న పోలికే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​-ఉపాసన దంపతులు పెళ్లైన పదేళ్లకు తల్లిదండ్రులు అయ్యారు. గతేడాది జూన్ నెలలో వీళ్లకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. తనకు క్లిన్ కార అనే పేరు పెట్టారు. ఆ బుజ్జాయిని చరణ్ దంపతులు అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. క్లిన్ కార రూమ్​ను స్పెషల్​గా డిజైన్ చేశారు. అలాగే ఆ పాప కోసం ఓ కేర్ టేకర్​ను కూడా ఏర్పాటు చేశారు. చరణ్ దంపతులు ఎక్కడికి వెళ్లినా క్లిన్ కారకు తోడుగా ఆ కేర్ టేకర్ ఉండాల్సిందే. క్లిన్ కారను కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు ఆ కేర్ టేకర్​కు నెలకు రూ.1.5 లక్షలు ఇస్తున్నారని వినికిడి. ఇక, క్లిన్ కారా ఫొటోను మెగా ఫ్యామిలీ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. దీంతో మెగా లిటిల్ ప్రిన్సెస్ ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సుకత అందరిలోనూ పెరిగిపోయింది.

క్లిన్ కార ఫొటో చూడాలని అనుకుంటున్న అభిమానుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఫస్ట్ టైమ్ చరణ్ వారసురాలి ఫొటోలు బయటకు వచ్చాయి. సతీమణి ఉపాసనతో కలసి మెగా పవర్ స్టార్ వైజాగ్ బీచ్​ను విజిట్ చేశారు. అక్కడ కూతురితో ఈ స్టార్ కపుల్ గడుపుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రివీల్ అయిన ఫొటోల్లో క్లిన్​కార ఫేస్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోలను నెట్టింట మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. వీటిన చూసిన నెటిజన్స్.. క్లిన్ కార అచ్చం తన నాన్న పోలికేనని అంటున్నారు. ఆ బుజ్జాయి చరణ్​లాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, చెర్రీ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. టాప్ ఫిల్మ్ మేకర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ వైజాగ్​లో జరుగుతోంది. దీంతో చిత్రీకరణ ముగిశాక సాయంత్రం వేళ ఉపాసన, క్లిన్ కారను తీసుకొని బీచ్​కు వెళ్లారు చరణ్​.

Mega Little Princess Clyn Cara face is clearly revealed 3

బీచ్​లో చేపలు, దూసుకొస్తున్న అలల్ని క్లిన్ కారకు చూపిస్తూ సందడి చేశారు చరణ్. ఇక, విశాఖ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే వరకు చెర్రీ అక్కడే ఉంటారు. దీంతో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. కాగా, ‘గేమ్ ఛేంజర్​’ను పొలిటికల్ థ్రిల్లర్​గా శంకర్ రూపొందిస్తున్నారు. ఇందులో చెర్రీ డ్యుయల్ రోల్​లో యాక్ట్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో చరణ్​ సరసన కియారా అద్వానీ హీరోయిన్​గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో సునీల్, అంజలి, శ్రీకాంత్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఇక, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో చరణ్ నెక్స్ట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పూర్తయితే బుచ్చిబాబు సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నం అవ్వాలని మెగా పవర్ స్టార్ భావిస్తున్నారట.

ఇదీ చదవండి: Game Changer To Kanguva On Amazon Prime: అమెజాన్ ప్రైమ్ ఈవెంట్.. చరణ్ నుంచి సూర్య దాకా.. 60 మూవీస్ స్ట్రీమింగ్ లిస్ట్!

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet