దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన బంధువులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆయన బంధువులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇప్పుడు మూవీ బిజినెస్ మొత్తం హీరోల మీదే డిపెండ్ అయింది. హీరోలకు ఉన్న మార్కెట్ రేంజ్, ఫ్యాన్ బేస్, క్రేజ్ ఆధారంగానే సినిమాలు తీస్తున్నారు ప్రొడ్యూసర్స్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి లాంటి ఒకరిద్దరు మాత్రం దీనికి మినహాయింపు అనే చెప్పాలి. జక్కన్న చిత్రాల్లో ఎవరు నటిస్తున్నారు? ఏ హీరో ఉన్నాడనేది అంతగా పట్టించుకోరు నిర్మాతలు. రాజమౌళి అనే బ్రాండ్‌కు ఉన్న వ్యాల్యూ ఆధారంగా రూ.వందల కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ తరంలో డైరెక్టర్స్‌కు ఇమేజ్ తీసుకొచ్చింది రాజమౌళి అనే చెప్పాలి. కానీ ఒకప్పుడు టాలీవుడ్లో దర్శకుల టాలెంట్‌ను నమ్ముకొనే సినిమాలను నిర్మించేవారు.
దాసరి నారాయణ, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, కోదండరామి రెడ్డి లాంటి వాళ్లు డైరెక్టర్స్‌కు క్రేజ్ తీసుకొచ్చారు. ముఖ్యంగా దాసరి నారాయణ, రాఘవేంద్రరావుల గురించి స్పెషల్‌గా చెప్పుకోవాలి. వీళ్ల సినిమాల్లో తారాగణం ఎవరనేది పెద్దగా పట్టించుకునేవారు కాదు ఆడియెన్స్. వాళ్ల మీద ఉన్న అభిమానం, నమ్మకంతో థియేటర్లకు క్యూ కట్టేవారు. అందుకు తగ్గట్లే తెరపై మ్యాజిక్ చేసేవాళ్లు దాసరి, రాఘవేంద్రరావు. ఇదిలా ఉంటే.. రాఘవేంద్రరావు సినిమాలు తగ్గించుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఆయన తాజాగా వార్తల్లో నిలిచారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వం కేటాయించిన భూమిని రాఘవేంద్రరావు తన సొంత అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలపై హైకోర్టు స్పందించింది.
సినీ పరిశ్రమకు సర్కారు కేటాయించిన భూముల కేసులో డైరెక్టర్ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన బంధువులకు కూడా మరోమారు నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్ ప్రాంతంలోని షేక్‌పేటలో 2 ఎకరాలను ప్రభుత్వం ఫిల్మ్ ఇండస్ట్రీకి కేటాయించింది. అయితే ఈ పిటిషన్‌పై గతంలో ఒకసారి నోటీసులు జారీ చేసినా.. అవి వాళ్లకు అందినట్లుగా రికార్డుల్లో లేకపోవడంతో గురువారం మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈ పిల్‌పై విచారణను జనవరి 18కి న్యాయస్థానం వాయిదా వేసింది.
మెదక్ జిల్లాకు చెందిన బాలకిషన్ అనే వ్యక్తి 2012లో హైకోర్టులో ఈ పిల్‌ను దాఖలు చేశారు. షేక్‌పేట సర్వే నెం.403/1లోని రెండెకరాల భూమిని వాణిజ్య అవసరాల కోసం వాడటం రూల్స్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ మీద చీఫ్ జస్టిస్ అలోక్ అరథే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదులైన రాఘవేంద్రరావుతో పాటు ఆయన బంధువులు కృష్ణమోహన్ రావు, చక్రవర్తి, విజయలక్ష్మీ, అఖిలాండేశ్వరి, లాలసా దేవికి నోటీసులు ఇచ్చింది. మరి.. డైరెక్టర్ రాఘవేంద్రరావుకు కోర్టు రెండోసారి నోటీసులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.