iDreamPost
android-app
ios-app

నా లైఫ్​లో ఆ ముగ్గుర్ని ఎప్పటికీ మర్చిపోలేను: రాఘవ లారెన్స్

  • Author singhj Published - 12:36 PM, Mon - 25 September 23
  • Author singhj Published - 12:36 PM, Mon - 25 September 23
నా లైఫ్​లో ఆ ముగ్గుర్ని ఎప్పటికీ మర్చిపోలేను: రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. డ్యాన్స్ మాస్టర్​గా, డైరెక్టర్​గా, నటుడిగా అలరిస్తూ ఆడియెన్స్​ మనసుల్లో ఆయన చెరగని స్థానం సంపాదించుకున్నారు. కెరీర్ మొదట్లో తమిళ సినిమాలతో పాటు తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్స్​ సినిమాలకు కొరియోగ్రాఫర్​గా పనిచేశారు లారెన్స్. ఆ తర్వాత దర్శకుడిగా పరిచయం అయ్యారాయన. ఆయనకు మెగాఫోన్ చేతబట్టే అవకాశం దక్కింది టాలీవుడ్​లోనే. కింగ్ నాగార్జున్ నటించిన ‘మాస్’ సినిమానే లారెన్స్​కు డైరెక్టర్​గా ఫస్ట్ ఫిల్మ్. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్​తో ‘రెబల్’ చిత్రాన్ని తెరకెక్కించారాయన.

‘రెబల్’ అంతగా ఆడకపోయినా లారెన్స్ స్టైలిష్ మేకింగ్​కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత నటుడిగా రూటు మార్చిన లారెన్స్.. ‘కాంచన’, ‘ముని’, ‘గంగ’ అంటూ ఆడియెన్స్​ను భయపెట్టారు. ఈ మూవీస్ మంచి విజయాలు సాధించడంతో ఆయన హీరోగా బాగా బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘చంద్రముఖి 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తలైవా రజినీకాంత్ యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ ‘చంద్రముఖి’కి సీక్వెల్​గా ఈ మూవీ రూపొందింది. ఇందులో లారెన్స్​తో పాటు మరో కీలక పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించారు. పి.వాసు డైరెక్షన్ వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

‘చంద్రముఖి 2’ రిలీజ్​కు టైమ్ దగ్గర పడటంతో ప్రమోషన్స్​లో జోరు పెంచారు లారెన్స్. ఈ సందర్భంగా హైదరాబాద్​లోనూ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ ‘రెబల్’ అనంతరం తెలుగులో మరో మూవీ తీయడం కుదర్లేదన్నారు. తనను ఇంతగా ఆదరిస్తున్న అభిమానుల ప్రేమలోనే దేవుడ్ని చూస్తున్నానని లారెన్స్ అన్నారు. దర్శకుడు వాసు ‘చంద్రముఖి 2’ అనౌన్స్ చేయగానే రజినీకాంత్​తో చేస్తున్నారేమోనని అనుకున్నానని.. కానీ తర్వాత డైరెక్టర్ తనకు స్టోరీ చెప్పగానే తలైవాకు ఫోన్ చేశానన్నారు.

‘చంద్రముఖి 2 చేస్తున్నానని రజినీకాంత్ అన్నయ్యకు చెప్పగానే ఆయన సంతోషంతో ఆల్ ది బెస్ట్ చెప్పారు. అంతేగాక రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు నాపై ఉంటాయన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా. రజినీ అన్నయ్య లేకపోతే ఈ వేదిక మీద నేను ఉండేవాడ్నే కాదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంతమంది ఫ్యాన్స్​ను సొంతం చేసుకున్నానంటే దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యే. నేను ఆయన నుంచే డ్యాన్స్ నేర్చుకున్నా. నన్ను దర్శకుడ్ని చేసిన నాగార్జునను ఎప్పటికీ మర్చిపోలేను’ అని లారెన్స్ చెప్పుకొచ్చారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి వీళ్లే కారణమన్నారు. చంద్రముఖి క్యారెక్టర్​లో కంగనా ఎంతగానో భయపెట్టారన్నారు లారెన్స్.

ఇదీ చదవండి: మతులు పోగొడుతున్న బిగ్ బాస్ రతిక.. ఫొటోలు వైరల్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి