Radhe Shyam : టార్గెట్ మార్చుకుంటున్న ప్రభాస్ టీమ్

ఇప్పుడు అందరి దృష్టి మెల్లగా మార్చి 11 వైపు వెళ్తోంది. రాధే శ్యామ్ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులు ఈ రెండు వారాలు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయాని టైమర్ పెట్టేసుకున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి మెల్లగా మార్చి 11 వైపు వెళ్తోంది. రాధే శ్యామ్ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులు ఈ రెండు వారాలు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయాని టైమర్ పెట్టేసుకున్నారు.

ఇంకో వారం పది రోజులు భీమ్లా నాయక్ సందడే ఉంటుంది. ఆ తర్వాత మార్చి 4న రాబోతున్న ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ లు ఎలా ఉన్నా వాటికి బడ్జెట్ పరంగా హీరోల ఇమేజ్ పరంగా రీచ్ పాన్ ఇండియా స్థాయి కాదు కాబట్టి ట్రేడ్ పరంగా మరీ అద్భుతాలు ఆశించలేం. ఇప్పుడు అందరి దృష్టి మెల్లగా మార్చి 11 వైపు వెళ్తోంది. రాధే శ్యామ్ కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులు ఈ రెండు వారాలు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయాని టైమర్ పెట్టేసుకున్నారు. చేతిలో చాలా తక్కువ టైం ఉండటంతో ప్రమోషన్ ప్లానింగ్ లో యువి టీమ్ చాలా బిజీగా ఉంది. గ్రాండ్ పబ్లిసిటీకి స్కెచ్చు వేసింది.

అందులో భాగంగానే కొత్త ట్రైలర్ ని సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆ మధ్య జనవరిలో రిలీజ్ చేసిన ట్రైలర్ కి ఆశించిన స్పందన దక్కలేదు. విజువల్స్ బాగున్నప్పటికీ ఇది మనకు ఎక్కేది కాదేమోనని మాస్ కు అనుమానం వచ్చేలా కట్ చేశారు. పైగా ఇటీవల విడుదలైన సినిమాల మధ్య థియేటర్లో ప్రదర్శించినప్పుడు రావాల్సిన స్పందన తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్స్ ఉన్నాయట. దాంతో మార్చి 2న అన్ని వర్గాలను టార్గెట్ చేసేలా కొత్త వీడియో వదలబోతున్నట్టు తెలిసింది. పాటలు బాగున్నప్పటికీ ఆశించిన రేంజ్ లో రీచ్ రాకపోవడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న మాట వాస్తవం. ఇంకొంచెం బలంగా వెళ్లాలని కోరుకుంటున్నారు.

కరోనా కోణంలో చూస్తే దేశవ్యాప్తంగా పరిస్థితులు సాధారణంగా మారిపోయాయి కాబట్టి పాన్ ఇండియా సినిమాలకు ఇబ్బంది లేనట్టే. జనం థియేటర్లకు బాగా వస్తున్నారు. అఖండ నుంచి భీమ్లా నాయక్ దాకా వచ్చిన కలెక్షన్లే దానికి సాక్ష్యం. సో రాధే శ్యామ్ గట్టిగా ప్లాన్ చేసుకుంటే టార్గెట్ చేరుకోవచ్చు. ఇది వచ్చిన సరిగ్గా రెండు వారాలకు ఆర్ఆర్ఆర్ ఉంటుంది కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టేసుకుని సేఫ్ అవ్వాలి. ఎలాగూ ఇప్పుడున్న సిచువేషన్ లో ఎక్కువ లాంగ్ రన్ లు ఆశించలేం కాబట్టి ఎక్కువ థియేటర్లు భారీ వసూళ్లు సూత్రాన్ని ఫాలో అవ్వడమే. రాధాకృష్ణ దర్శకత్వంలో వహించిన రాధే శ్యామ్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు

Also Read : Bheemla Nayak : ముందే జాగ్రత్తపడాలి పోలీస్ నాయకా

Show comments