iDreamPost
android-app
ios-app

ప్రభాస్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్

  • Published Nov 28, 2024 | 4:22 PM Updated Updated Nov 28, 2024 | 4:22 PM

మహా అయితే ఒక సినిమాకు సంవత్సరం లేదా రెండు సంవత్సరాల సమయం కేటాయిస్తారు. గతంలో అంజి , అమ్మోరు లాంటి సినిమాలకు ఎక్కువ కాలం తీసుకున్న మాట వాస్తవమే. కానీ అక్కడ బడ్జెట్, విఎఫ్ఎక్స్ లాంటివి ఆలస్యానికి కారణంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణాలు అవి కాదు.. సినిమాపై ప్రేక్షకులు పెట్టుకుంటున్న అంచనాలు.

మహా అయితే ఒక సినిమాకు సంవత్సరం లేదా రెండు సంవత్సరాల సమయం కేటాయిస్తారు. గతంలో అంజి , అమ్మోరు లాంటి సినిమాలకు ఎక్కువ కాలం తీసుకున్న మాట వాస్తవమే. కానీ అక్కడ బడ్జెట్, విఎఫ్ఎక్స్ లాంటివి ఆలస్యానికి కారణంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణాలు అవి కాదు.. సినిమాపై ప్రేక్షకులు పెట్టుకుంటున్న అంచనాలు.

  • Published Nov 28, 2024 | 4:22 PMUpdated Nov 28, 2024 | 4:22 PM
ప్రభాస్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్

మహా అయితే ఒక సినిమాకు సంవత్సరం లేదా రెండు సంవత్సరాల సమయం కేటాయిస్తారు. గతంలో అంజి , అమ్మోరు లాంటి సినిమాలకు ఎక్కువ కాలం తీసుకున్న మాట వాస్తవమే. కానీ అక్కడ బడ్జెట్, విఎఫ్ఎక్స్ లాంటివి ఆలస్యానికి కారణంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణాలు అవి కాదు.. సినిమాపై ప్రేక్షకులు పెట్టుకుంటున్న అంచనాలు. ఇప్పుడు వస్తున్న సినిమాలలో అయితే ఏళ్ళ తరబడి ఒకే సినిమాకు ఖర్చు చేయడం, సమయం కేటాయించడం బాహుబలి నుంచి మొదలైంది. పార్ట్ 1కు నార్మల్ హిట్ వచ్చి ఉంటే ఆ తర్వాత పార్ట్ త్వరగానే రిలీజ్ అయ్యి ఉండేది. కానీ ఈ అంచనాల వలన అవి కాస్త అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది. పుష్ప విషయంలోనూ అదే జరిగింది. అప్పుడెప్పుడో వచ్చిన పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. పార్ట్ 2 ఇప్పటికి రిలీజ్ అవుతుంది. నార్మల్ హిట్ అయ్యి ఉంటే ఈపాటికి బన్నీ ఓ రెండు సినిమాలు చేసేవాడేమో.

కానీ ఈ విపరీతమైన హైప్ , క్రేజ్ వలన మొత్తానికి పుష్ప కంప్లీట్ అవ్వడానికి ఐదేళ్లు పట్టింది. ఎట్టకేలకు డిసెంబర్ 5 న పుష్ప మ్యానియాను ఎక్స్పీరియెన్స్ చేయబోతున్నారు అభిమానులు. ఈ సినిమా ఎలాగూ బ్లాక్ బస్టర్ కొట్టేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బన్నీకి ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే. ఈ సినిమా తర్వాత బన్నీ మరో సినిమా వెంటనే చేస్తాడా లేదా గ్యాప్ తీసుకుంటాడా అని అభిమానులు సందేహంలో పడ్డారు. ఎందుకంటే ఈ సినిమా కోసం ఇంత గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి.. సాధారణంగా ఇలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ అభిమానులు కూడా ఇలానే ఫీల్ అయ్యారు. కానీ డార్లింగ్ మాత్రం ఇప్పుడు ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేస్తూ.. వరుస సినిమాలను అనౌన్స్ చేసేసాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 సినిమాలు చేతిలో.. మరో ఆరు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా డార్లింగ్ ను ఫాలో అవుతున్నాడని సమాచారం.

తాజాగా జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ.. అభిమానులను ఇప్పటికే మూడు సంవత్సరాలు వెయిట్ చేయించానని.. ఇకపై గ్యాప్ రానివ్వకుండా చూసుకుంటానని.. మల్లువుడ్ ఫ్యాన్స్ సాక్షిగా మల్లు అర్జున్ ప్రామిస్ చేశాడు. సో అల్లు అర్జున్ ఇక స్పీడ్ పెంచే పనిలో ఉన్నాడని క్లియర్ గా అర్ధమౌతుంది. ఇక దర్శకులు కథలతో రెడీగా ఉండడమే లేట్. అల్లు అర్జున్ కూడా డార్లింగ్ లా నెక్స్ట్ సినిమాతో వింటేజ్ వెర్షన్ గుర్తుచేస్తాడో .. లేదా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. ఇప్పుడున్న క్రేజ్ చూస్తుంటే డార్లింగ్ తర్వాత ఆ రేంజ్ స్టార్ డం సంపాదించడం.. బన్నీకే సాధ్యం అంటున్నారు అభిమానులు. ఇక పుష్ప 2 రిలీజ్ తర్వాత ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.