iDreamPost
android-app
ios-app

ప్రభాస్- మహేశ్ తో పోటీపై బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

  • Published Nov 15, 2024 | 12:59 PM Updated Updated Nov 15, 2024 | 12:59 PM

Allu Arjun: అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నది. ఈ క్రమంలో బన్నీ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ -మహేష్ తో పోటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Allu Arjun: అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నది. ఈ క్రమంలో బన్నీ అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ -మహేష్ తో పోటీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Nov 15, 2024 | 12:59 PMUpdated Nov 15, 2024 | 12:59 PM
ప్రభాస్- మహేశ్ తో పోటీపై బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ పుష్ప-2 ది రూలర్. ది మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2ది రూల్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 05న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. రెండ్రోజుల్లో ట్రైలర్ గ్రాండ్ గా లాంఛ్ చేయబోతోంది చిత్ర యూనిట్. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలవడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. హీరోయిన్ రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా ఇప్పటికే ఫస్ట్ రివ్యూ ఇచ్చేసింది.

ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పానని అది అదిరిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు బన్నీ పుష్ప 2కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. బుల్లితెర రియాలిటీ షో అన్ స్టాపబుల్ లో పాల్గొన్న అల్లు అర్జున్ పుష్ప 2 గురించి, ఇండస్ట్రీలోని హీరోలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో హోస్ట్ బాలయ్య అల్లు అర్జున్ ను ఇరుకున పెట్టే ప్రశ్న సంధించాడు. ఇండస్ట్రీలో నీకు అతిపెద్ద పోటీ ఎవరని అనుకుంటున్నావ్? ప్రభాస్ లేదా మహేష్ అని అడగ్గా.. దీనికి బన్నీ లాజిక్ గా ఆన్సర్ ఇచ్చాడు. ప్రభాస్- మహేశ్ తో పోటీపై బన్నీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నన్ను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే! నాకు నేనే పోటీ అని సమాధానం ఇచ్చాడు.

ఎవరి ఫ్యాన్స్ ను హర్ట్ చేయకుండా అల్లు అర్జున్ కామెంట్స్ చేశాడు. బన్నీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి. బన్నీ మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.. ఆయన కమ్ బ్యాక్స్ బాగుంటాయి. ఫెయిల్యూర్స్ తర్వాత ఆయన కమ్ బ్యాక్స్ నాకు ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అలాగే ప్రభాస్ గురించి చెప్తూ.. అతను ఆరడుగుల బంగారం అని.. మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అని అన్నాడు. క్రిస్మస్ వేడుకల్లో నేను క్రిస్మస్ ట్రీ పెడతాను ప్రభాస్ కు ఈ విషయం తెలిసి నాకోసం యూరప్ నుంచి డెకరేషన్ ఐటెమ్స్ తీసుకొచ్చారు అని బన్నీ తెలిపాడు.

పుష్ప2 ఇంకో 20 రోజుల్లో విడుదలవనున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ షూటింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ తో బిజీ అయిపోయింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. పుష్ప పార్ట్ 1 రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. పుష్పలో అల్లు అర్జున్ నటనకు నేషనల్ బెస్ట్ ఆక్టర్ అవార్డు అందుకున్నారు. పుష్పలోని డైలాగ్స్, సాంగ్స్ కు వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడంతా పుష్ప2 కోసం ఎదురుచూస్తున్నారు. మరి బన్నీ ప్రభాస్- మహేశ్ తో పోటీపై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio