iDreamPost
iDreamPost
గత ఏడాది డిసెంబర్ లో విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని సౌత్ కంటే ఎక్కువ నార్త్ లోనే అదరగొట్టిన పుష్ప పార్ట్ 1 కొనసాగింపు కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అంచనాలు మించిపోవడంతో సుకుమార్ స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెడుతున్నారు. ఈ డిసెంబర్ రిలీజ్ కు ఛాన్స్ లేదు. ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కాబట్టి వచ్చే సంవత్సరం వేసవికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే క్లారిటీ ఇంకా రాలేదు. ఇటీవలే యుఎస్ వెళ్లి వచ్చిన దర్శకుడు సుకుమార్ బన్నీతో డిస్కస్ చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేశాక మంచి ముహూర్తం చూసుకుని కెమెరా ఆన్ చేస్తారు.
ఇక దీని బడ్జెట్ ని మైత్రి సంస్థ ఏకంగా డబుల్ చేసిందని సమాచారం. ఒక్క అల్లు అర్జున్ రెమ్యునరేషనే వంద కోట్ల దాకా ఉండొచ్చట. సుకుమార్ కు ఓ అరవై దాకా ముట్టజెప్పి మిగిలిన ఆర్టిస్టుల పారితోషికాలు కలుపుకుంటే ఇక్కడే రెండు వందల కోట్ల దాకా తేలుతుంది. ప్రొడక్షన్ కోసం అయ్యే వ్యయం ఇంకో రెండు వందలు ఎక్స్ ట్రా. సో ఇదంతా చూస్తే బన్నీ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా పుష్ప 2 నిలవబోతోంది. ఇది అఫీషియల్ గా చెప్పింది కాదు కానీ లీకవుతున్న న్యూస్ ని బట్టి అందుతున్న డేటా. ఇప్పటికే అయిదు నెలలు గడిచిపోయాయి. అభిమానులు ఎప్పుడు మొదలుపెడతారాని ఎదురు చూస్తున్నారు. ఇంకో నెలలో అవి తీరొచ్చు.
ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప క్రేజ్ మాములుగా లేదు. మొదటి భాగానికి జరిగిన బిజినెస్ కి అయిదింతలకు పైగా ఆఫర్లు వస్తున్నాయి. అయినా కూడా ఇంకా అమ్మకుండా వేచి చూసే ధోరణిలో ఉన్నారు నిర్మాతలు. కెజిఎఫ్ 2 తర్వాత ఒక సీక్వెల్ కి ఆ స్థాయిలో హైప్ రావడం ఒక్క పుష్ప2కే జరుగుతుందని అక్కడి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అల వైకుంఠపురములో తర్వాత స్లో అండ్ స్టడీ సూత్రాన్ని పాటిస్తున్న అల్లు అర్జున్ పుష్ప తర్వాత చేయబోయే సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. సంజయ్ లీలా భన్సాలీతో అన్నారు కానీ ఇంకా దానికి తాలూకు క్లియర్ ఇన్ఫో లేదు. పుష్ప 2 మొదలయ్యే దాకా వెయిట్ చేయాల్సి రావొచ్చు.