Swetha
Pushpa 2 , Game Changer Pramotions: ఏదైనా సినిమాకు మొదటి పార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయితే.. కచ్చితంగా రెండో పార్ట్ మీద అంచనాలు పెరుగుతాయి. అలాగే పుష్ప 2 మీద కూడా ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటె.. ఇంకా విడుదలకు చాలనే సమయం ఉన్నా కూడా.. పుష్ప 2 కి ఏ మాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది గేమ్ ఛేంజర్ .
Pushpa 2 , Game Changer Pramotions: ఏదైనా సినిమాకు మొదటి పార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయితే.. కచ్చితంగా రెండో పార్ట్ మీద అంచనాలు పెరుగుతాయి. అలాగే పుష్ప 2 మీద కూడా ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటె.. ఇంకా విడుదలకు చాలనే సమయం ఉన్నా కూడా.. పుష్ప 2 కి ఏ మాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది గేమ్ ఛేంజర్ .
Swetha
ఏదైనా సినిమాకు మొదటి పార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అయితే.. కచ్చితంగా రెండో పార్ట్ మీద అంచనాలు పెరుగుతాయి. అలాగే పుష్ప 2 మీద కూడా ఏర్పడ్డాయి. షూటింగ్ మొదలైనప్పటినుంచి కూడా ఒక్కో లెవెల్ లో అంచనాలు పెంచుతూ వచ్చారు మేకర్స్. ఇప్పటివరకు ఈ సినిమా రూ.1400 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీనిని బట్టే సినిమా స్థాయి ఏంటి అనేది అర్ధం చేసుకోవచ్చు. అందుకోసమే చేసిన బిజినెస్ కు తగినట్లుగా వసూళ్లను రాబట్టాలని గట్టిగా ఫిక్స్ అయింది పుష్ప టీం. అలా రాబట్టాలంటే కచ్చితంగా ప్రేక్షకులలోకి సినిమాను తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకే దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. టైలర్ లాంచ్ ఈవెంట్ ను పాట్నా లో నిర్వహించబోతున్నారన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నార్త్ , సౌత్ లలో పుష్ప 2 ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటితో పాటు మీడియా సమావేశాలు , స్పెషల్ పబ్లిసిటీలు , ఇంటర్వ్యూలు వీటి అన్నిటిని కూడా ప్లాన్ చేస్తున్నారట టీం. వారి దగ్గర ఉన్న సమయానికి.. పెండింగ్ వర్క్స్ కి ఇవన్నీ ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు. కానీ అభిమానులు మాత్రం కాస్త కంగారుగా కాస్త ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
ఇదిలా ఉంటె.. ఇంకా విడుదలకు చాలనే సమయం ఉన్నా కూడా.. పుష్ప 2 కి ఏ మాత్రం తగ్గకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది గేమ్ ఛేంజర్ . ఆల్రెడీ టీజర్ లాంచ్ ఈవెంట్ ను భారీ ఎత్తులో లక్నోలో నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న అంచనాలు.. టీజర్ తో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సో మేకర్స్ ఇంకాస్త పకడ్బందీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ నార్త్ లో ఎక్కడెక్కడ ఈవెంట్స్ నిర్వహించాలో పక్కా స్కెచ్ వేశారు. ముఖ్యంగా ముంబై లో జరిగే ఈవెంట్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ముఖ్య అతిధిగా రానున్నాడట. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఈవెంట్స్ లో మెగాస్టార్ ఎలాగూ ఉండనే ఉంటారు. చిరంజీవి తో పాటు మరో స్టార్ హీరోను కూడా తీసుకోవచ్చే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. చెన్నైలో ఈవెంట్ కు రజినీకాంత్ రానున్నారని సమాచారం. ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా కోసం టీం అంతా కూడా యూఎస్ కు వెళ్లినట్లు సమాచారం. ఈ విధంగా ముందు నుంచే ప్రమోట్ చేయడం ద్వారా రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టొచ్చని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారట.
ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో తెలిసిన నిర్మాతల్లో దిల్ రాజు ముందుటాడు. అందుకే గేమ్ ఛేంజర్ ను సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పుష్ప 2 కి ఉన్నంత బజ్ గేమ్ ఛేంజర్ కు లేదు. కానీ ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులు బాగానే ఎదురుచూస్తున్నారు. ఒక్కసారి పుష్ప మూవీ రిలీజ్ అయితే.. అప్పుడు గేమ్ ఛేంజర్ పై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి రెండు సినిమాలు పోటా పోటీగా ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నాయి. ఇది చూసిన మ్యూచువల్ ఫ్యాన్స్ ఒక ప్లానింగ్ , ఓ పద్దతి.. ఓ విజన్ అంటే ఇది.. ఇలా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ రెండిటిలో ప్రేక్షకులను ఏ సినిమా మెప్పిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.