iDreamPost
android-app
ios-app

Double Ismart: డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్‌ చూశారా.. ఈ సారి దిమాక్‌ కిరికిరి పక్కా

  • Published May 15, 2024 | 11:07 AMUpdated May 15, 2024 | 11:07 AM

రామ్‌-పూరి జగన్నాధ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలయ్యింది. మరి డబుల్‌ ఇస్మార్ట్‌ ఎలా ఉండబోతుంది అంటే..

రామ్‌-పూరి జగన్నాధ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌. తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలయ్యింది. మరి డబుల్‌ ఇస్మార్ట్‌ ఎలా ఉండబోతుంది అంటే..

  • Published May 15, 2024 | 11:07 AMUpdated May 15, 2024 | 11:07 AM
Double Ismart: డబుల్‌ ఇస్మార్ట్‌ టీజర్‌ చూశారా.. ఈ సారి దిమాక్‌ కిరికిరి పక్కా

హీరో రామ్‌ పోతినేని కేరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ఇస్మార్ట్‌ శంకర్‌. ఈ సినిమాలో రామ్‌ పక్కా ఊర మాస్‌ లుక్‌లో.. అది కూడా తెలంగాణ యాసలో అదరకొట్టాడు. పూరి జగన్నాధ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఇస్మార్ట్‌ శంకర్‌ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో రామ్‌ సరసన నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రామ్‌ మాస్‌ యాక్టింగ్‌, లుక్కు, యాస, యాటిట్యూడ్‌ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పూరి మార్క్‌ డైలాగ్స్‌కు ప్రేక్షకులు ఎప్పటి లానే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారు. ఇక థియేటర్లలో భారీ విజయం సాధించిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాకు సీక్వేల్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రం తెరకెక్కుతుంది.

ప్రస్తుతం డబుల్‌ ఇస్మార్ట్‌ షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతుంది. పూరి జగన్నాధ్ సొంత దర్శక నిర్మాణంలో.. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇక నేడు రామ్‌ పోతినేని బర్త్‌డే సందర్భంగా.. సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఫస్ట్‌ పార్ట్‌కు మించిన యాక్షన్‌ సీక్వెల్స్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ తెరకెక్కిన్నట్లు టీజర్‌ చూస్తేనే అర్థం అవుతుంది. దీన్ని చూస్తే ఇస్మార్ట్‌ శంకర్‌కు కొనసాగింపు అని అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంలో రామ్‌కు జోడిగా కావ్య థాపర్‌ నటిస్తోంది.

ఇస్మార్ట్‌ శంకర్‌ లానే ఈ సినిమాలో కూడా యాక్షన్‌ సీన్స్‌ భారీగానే ఉన్నట్లు టీజర్‌ను చూస్తే అర్ధం అవుతుంది. డబుల్‌ ఇస్మార్ట్‌లో కూడా మరోసారి తెలంగాణ స్లాంగ్‌తో అదరగొట్టాడు రామ్‌. ఇక ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ భారీగా ఉన్నట్లు టీజర్‌ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఇస్మార్ట్‌ శంకర్‌ మాదిరిగానే.. దీని క్లైమాక్స్‌ను కూడా శివుడి రిఫరెన్స్‌తో ముగించారు. టీజర్‌ చూస్తేంటే.. రామ్‌ ఖాతాలో మరో హిట్టు గ్యారెంటీ అనిపిస్తోంది. ఇక ఈ సినిమాను పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ కాబోతుంది. తెలుగు, హిందీ, తమిళ్‌ కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి