iDreamPost
android-app
ios-app

సెట్ లోనే ఆ స్టార్ హీరోయిన్ చెంప పగలగొట్టా: స్టార్ హీరో

  • Published Jul 17, 2024 | 6:48 PM Updated Updated Jul 17, 2024 | 6:48 PM

సెట్ లోనే ఓ స్టార్ హీరోయిన్ చెంప చెళ్లుమనింపించానని చెప్పుకొచ్చాడు ఓ స్టార్ హీరో. మరి ఆ హీరో ఎవరు? ఆ హీరోయిన్ ను ఎందుకు కొట్టాడు?

సెట్ లోనే ఓ స్టార్ హీరోయిన్ చెంప చెళ్లుమనింపించానని చెప్పుకొచ్చాడు ఓ స్టార్ హీరో. మరి ఆ హీరో ఎవరు? ఆ హీరోయిన్ ను ఎందుకు కొట్టాడు?

సెట్ లోనే ఆ స్టార్ హీరోయిన్ చెంప పగలగొట్టా: స్టార్ హీరో

సినిమా షూటింగ్స్ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్ని వివాదాలకు దారితీస్తే.. మరికొన్ని సరదాగా జీవితంలో గుర్తుంటాయి. షూటింగ్ లో జరిగిన ఓ సంఘటనను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు ఓ స్టార్ హీరో. సెట్ లోనే ఓ స్టార్ హీరోయిన్ చెంప చెళ్లుమనింపించానని చెప్పుకొచ్చాడు. మరి ఆ హీరో ఎవరు? ఆ హీరోయిన్ ను ఎందుకు కొట్టాడు? తెలుసుకుందాం పదండి.

షర్మిలా ఠాగూర్.. తన అందం, అభినయంతో అలనాటి ప్రేక్షకులను అలరించింది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అలాంటి హీరోయిన్ ను సెట్ లోనే కొట్టానని చెప్పుకొచ్చాడు బెంగాలీ హీరో ప్రొసెంజిత్ చటర్జీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు మాట్లాడుతూ..”నాన్న విశ్వజిత్ చటర్జీతో కలిసి షూటింగ్ కు వెళ్లాను. అప్పుడు నాకు నాలుగైదు ఏళ్లు ఉంటాయనుకుంటా. ఆ రోజు షూటింగ్ లో ఓ ఎమోషనల్ సీన్ లో షర్మిలా ఠాగూర్ నాన్నను కొట్టింది. ఆ కోపంతో.. లంచ్ టైమ్ లో ఆమె నన్ను దగ్గరికి తీసుకోగానే, ఆమె చెంప చెళ్లుమనిపించాను. దాంతో అక్కడున్న వారంతా  షాక్ అయ్యారు. ఇప్పటికీ కలిసిన ప్రతీసారి ఆ సంఘటనను ఆమె గుర్తు చేస్తూనే ఉంటుంది. మీ నాన్నను కొట్టానన్న కోపంతోనే కదా నన్ను కొట్టావ్ అంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు ప్రొసెంజిత్ చటర్జీ. ప్రభాతెర్ రంగ్, యో రాత్ ఫిర్ నా ఆయేగీ అనే రెండు చిత్రాల్లో విశ్వజిత్ చటర్జీ, షర్మిలా జంటగా నటించారు. ఇక ప్రొసెంజిత్ చటర్జీ కెరీర్ విషయానికి వస్తే.. రితుపర్ణ సేన్ గుప్తాతో కలిసి దాదాపు 50 చిత్రాల్లో నటించాడు. దాంతో వీరిద్దరిని అభిమానులు ముద్దుగా గోల్డెన్ కపుల్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఆయన మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు.

Prosenjit chaterjee about a incident