iDreamPost
android-app
ios-app

Devi Sri Prasad: పుష్ప 2 రూమర్లపై క్లారిటీ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్!

  • Published Jul 17, 2024 | 5:27 PM Updated Updated Jul 17, 2024 | 5:27 PM

పుష్ప 2 మూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. డైరెక్టర్, హీరో విదేశాలకు వెళ్లడంతో టాలీవుడ్ షాక్ అయ్యింది. ఇక ఈ విషయంపై రకరకాల రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.

పుష్ప 2 మూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి.. డైరెక్టర్, హీరో విదేశాలకు వెళ్లడంతో టాలీవుడ్ షాక్ అయ్యింది. ఇక ఈ విషయంపై రకరకాల రూమర్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.

  • Published Jul 17, 2024 | 5:27 PMUpdated Jul 17, 2024 | 5:27 PM
Devi Sri Prasad: పుష్ప 2 రూమర్లపై క్లారిటీ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్!

పుష్ప 2.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ మూవీ గురించే చర్చ నడుస్తోంది. అనుకోకుండా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వడం, డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విదేశాలకు వెకేషన్ కు వెళ్లడంతో టాలీవుడ్ మెుత్తం ఒక్కసారిగా షాక్ కు గురైంది. బన్నీ, సుక్కు మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని, అందుకే ఇలా ఇద్దరు విదేశాలకు పయణం అయ్యారని రకరకాల న్యూస్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

‘పుష్ప 2’ ఆగస్ట్ 15న రావాల్సిన ఈ చిత్రం షూటింగ్ ఆలస్యం కావడంతో.. డిసెంబర్ 6కు పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదిచాలదు అన్నట్లుగా వారిని టెన్షన్ పెట్టే సంఘటన ఇంకోటి జరిగింది. పుష్ప షూటింగ్ కు అనుకోకుండా బ్రేక్ ఇచ్చి హీరో, డైరెక్టర్ విదేశాలకు వెళ్లారు. పైగా బన్నీ తన గడ్డం తీసేశాడు. దాంతో అసలు ఏం జరుగుతుందో తెలీక ఫ్యాన్స్ అయోమయానికి గురౌతున్నారు. ఇక ఈ విషయాలపై తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు మ్యూజిక్  డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్.

మీడియాతో దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ..”పుష్ప 1 బ్లాక్ బస్టర్ కావడంతో.. పుష్ప 2పై వరల్డ్ వైడ్ గా అంచనాలు భారీగా పెరిగాయి. అయితే వాటిని అందుకోవడంతో బన్నీ-సుక్కు మ్యాజిక్ చేస్తారన్న నమ్మకం ఉంది. వారిపై చాలా ఒత్తిడి ఉంది. కానీ నేను ఎలాంటి స్ట్రెస్ లేకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. డైరెక్టర్ సుకుమార్ రెండు రోజుల్లో ఇండియాకు వస్తారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’ సాంగ్ కు అన్ని భాషల్లో అదిరిపోయే ఆదరణ లభిస్తోంది. అస్సాంలో ఓ ఈవెంట్ కు వెళ్లాను.. అక్కడ కూడా ఇదే పాట వినిపించింది” అంటూ చెప్పుకొచ్చాడు DSP. ఇక హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అక్టోబర్ 10న తన లైవ్  కాన్సర్ట్ ఉంటుందని అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss