iDreamPost
android-app
ios-app

‘ఏజెంట్’ మూవీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్!

  • Author Soma Sekhar Published - 11:55 AM, Thu - 22 June 23
  • Author Soma Sekhar Published - 11:55 AM, Thu - 22 June 23
‘ఏజెంట్’ మూవీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్రొడ్యూసర్!

ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఆ మూవీపై భారీ అంచనాలు ఏర్పడటం సహజమే. ఇక కొన్ని సినిమాలు అయితే ట్రైలర్ తోనే భారీ హైప్ ను క్రియేట్ చేస్తాయి. ఈ మధ్య కాలంలో ట్రైలర్ తో అలాంటి హైప్ క్రియేట్ చేసిన సినిమా ‘ఏజెంట్’. అక్కినేని అఖిల్ హీరోగా నటించగా.. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. తాజాగా ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు స్టార్ ప్రొడ్యూసర్. ఆ మూవీ కొనకుండా నన్ను ఆ దేవుడే కాపాడాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఏజెంట్.. అక్కినేని అఖిల్ హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసిన ఏజెంట్.. మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. దాంతో డిస్టిబ్యూటర్లకు ఘోరంగా నష్టాలు వచ్చాయి. ఇక ఈ సినిమా గురించి అందరు మర్చిపోయారు. అలాంటి టైమ్ లో స్టార్ ప్రొడ్యూసర్, డిస్టిబ్యూటర్ సునీల్ నారంగ్ ఏజెంట్ మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

“ఏజెంట్ మూవీ హక్కులను తొలుత మేమే తీసుకోవాలనుకున్నాం. కానీ నిర్మాతలు భారీగా డిమాండ్ చేశారు. దాంతో అంత రేటు వర్కౌట్ కాదని, వేరే వాళ్లకి ఇచ్చేయండి అని వారికి చెప్పాం. నిజంగా ఈ సినిమా విషయంలో మమ్మల్ని ఆ దేవుడే కాపాడాడు” అంటూ నిర్మాత సునీల్ నారంగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఏజెంట్ హక్కుల్ని ఆయన తీసుకుంటే భారీ నష్టాల్ని చూడాల్సి వచ్చేది. ఇక థియేటర్లలోకి ఏజెంట్ వచ్చి 50 రోజుల పైనే అవుతున్నప్పటికీ.. ఇంత వరకు ఈ సినిమా ఓటీటీలోకి రాలేదు. కాగా.. ఏజెంట్ మూవీని ఎడిటింగ్ చేసి జూన్ 23 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇక నిర్మాత సునీల్ నారంగ్ చేసిన వ్యాఖ్యలు దేనికి దారితీస్తాయో వేచి చూడాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş