iDreamPost
android-app
ios-app

‘సరిపోదా శనివారం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్!

  • Published Jul 08, 2024 | 5:42 PM Updated Updated Jul 08, 2024 | 5:42 PM

Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్... నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ బ్యూటీ పరిచయమైంది. తాజాగా ఆమె నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ నుంచి ఆ బ్యూటీ పోస్టర్ రిలీజైంది

Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్... నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ బ్యూటీ పరిచయమైంది. తాజాగా ఆమె నటిస్తున్న సరిపోదా శనివారం మూవీ నుంచి ఆ బ్యూటీ పోస్టర్ రిలీజైంది

  • Published Jul 08, 2024 | 5:42 PMUpdated Jul 08, 2024 | 5:42 PM
‘సరిపోదా శనివారం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్!

సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అదే సమయంలో వివిధ మూవీలకు సంబంధించి రిలీజ్ డేట్స్ కోసం, పోస్టర్లలు, ట్రైలర్, గ్లింప్స్ వంటివి కోసం సినీ లవర్స్ ఎందురు చూస్తుంటారు. అలానే తరచూ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వస్తుంటాయి. తాజాగా నాచురల్ స్టార్ నాని, ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న తాజా చిత్రం.. ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ప్రియాంక్ అదిరిపోయే లుక్స్ తో ఆకట్టుకుంది.

ప్రియాంక అరుళ్ మోహన్… నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ బ్యూటీ పరిచయమైంది. తొలి సినిమాలోనే తన అందం, నటనతో టాలీవుడ్ ఆడియన్స్ ను తనవైపు తిప్పుకునేలా చేసింది. అంతేకాక తరచూ సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత పలు తమిళ సినిమాల్లో సైతం నటించింది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో ఈ మలయాళ బ్యూటీ వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. గతంలో గ్యాంగ్ లీడర్ తో జతకట్టిన ఈ భామ మరోసారి కూడా నానితో నటిస్తుంది.

నాని, ప్రియాంక నటిస్తున్న తాజా చిత్రం  ‘సరిపోదా శనివారం’. ఈ  సినిమా నుంచి ఇప్పటికే నాని లుక్స్ రిలీజ్  చేసి.. మూవీపై అంచనాలను భారీగా పెంచారు మేకర్స్. ఇదే సమయంలో తాజాగా ఇదే సినిమా నుంచి ప్రియాంక మోహన్ పాత్రను పరిచయం చేస్తూ.. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఇందులో ఆమె అందానికి అందరు ఫిదా అవుతున్నారు. ఇక పోస్టర్ ను గమనించినట్లు అయితే.. పోలీస్ గెటప్ లో ఎంతో అమాయకంగా ప్రియంగా కనిపిస్తుంది. చారులత పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ రివీల్ చేశారు. పోలీస్ డ్రెస్ లో భుజంపై బ్యాగ్‌‌‌‌‌‌‌‌తో నడుస్తూ చిరునవ్వులు చిందుస్తున్న ప్రియాంక మోహన్ పోస్టర్ తెగ ఆకట్టుకుంది.

ఇక సరిపోదా శనివారం సినిమాకు  వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. అలానే ఈ సినిమాను డీవీవీ  దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో ఎస్‌‌‌‌‌‌‌‌జే సూర్య, సాయి కుమార్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగస్ట్ 29న పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షుకల ముందుకు రానుంది. మొత్తంగా తాజాగా రిలీజైన ఈ పోస్టర్ లో ప్రియాంక అమాయకపు చూపులు కుర్రాళ్లను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş