iDreamPost
android-app
ios-app

పుష్ప 2 టీం కు 1000 కోట్ల క్రేజ్ ఉంది.. కానీ టైం బాలేదు!

  • Published Oct 30, 2024 | 11:16 AM Updated Updated Oct 30, 2024 | 11:16 AM

Pushpa 2 Movie Updates : ప్రస్తుతం అందరి కళ్ళు పుష్ప 2 మీదే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్నారు ప్రేక్షకులు. అంతా బాగానే ఉంది.. 1000 కోట్ల హైప్ నడుస్తుంది. కానీ పుష్ప 2 టీం కు మాత్రం టైం బాలేదు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

Pushpa 2 Movie Updates : ప్రస్తుతం అందరి కళ్ళు పుష్ప 2 మీదే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్నారు ప్రేక్షకులు. అంతా బాగానే ఉంది.. 1000 కోట్ల హైప్ నడుస్తుంది. కానీ పుష్ప 2 టీం కు మాత్రం టైం బాలేదు. ఆ మ్యాటర్ ఏంటో చూసేద్దాం.

  • Published Oct 30, 2024 | 11:16 AMUpdated Oct 30, 2024 | 11:16 AM
పుష్ప 2 టీం కు 1000 కోట్ల క్రేజ్ ఉంది.. కానీ టైం బాలేదు!

పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ బెండు తీసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే మొదటి నుంచి కూడా దేవర బాటలోనే పుష్ప అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. క్రియేట్ చేయాల్సిన రికార్డ్స్ విషయం పక్కన పెడితే.. రిలీజ్ కు ముందు దేవరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో.. ఇప్పుడు పుష్ప టీం కు కూడా అది తప్పడం లేదు. వాస్తవానికి పుష్ప పార్ట్ 1 రిలీజ్ టైం లో వరల్డ్ వైడ్ గా ఇంత హైప్ అయితే లేదు. అంత హిట్ అవుతుందని కూడా ఎవరు ఊహించలేదు. పైగా నార్త్ లో ప్రమోషన్స్ కు అంత టైం కూడా లేదు.  అయినా సరే పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలోని డైలాగ్స్ ను క్రికెటర్స్ , నేషనల్ పొలిటీషియన్స్ అంతా ఇమిటేట్ చేయడంతో.. సినిమా సీన్ మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ అయింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మినిమమ్ అంచనాలతో 450 కోట్లు వసూళ్లు చేసింది. అందుకే ఇప్పుడు పార్ట్ 2 మీద ఇంత క్రేజ్ నడుస్తుంది. దాదాపు 60 శాతం ప్రమోషన్స్ ఫ్యాన్స్ ఏ చేసేస్తున్నారు. సరే ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.

పుష్ప 2 మూవీ రిలీజ్ కు అన్నీ భయంకరంగా కలిసి వచ్చేస్తున్నాయి. హైప్ మొదలుకొని థియేటర్ లో లాంగ్ రన్ మెయింటన్ చేసే వరకు కూడా పక్కా ప్లానింగ్ తో బరిలో దిగుతుంది. సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా డోకా లేదు.. కావాల్సినంత టైం ఉంది.. సుమారు 1000 కోట్ల హైప్ ఉంది.. కానీ ఏం లాభం పుష్ప టీం కు మాత్రం నిరాశ తప్పడం లేదు. ఏమి చేయలేని నిస్సహాయత స్థితిలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమైందో తెలియనిది కాదు.. అభిమానుల తాకిడి తట్టుకోలేక ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు పుష్ప 2 ప్రమోషన్స్ విషయంలో కూడా ఇదే జరగబోతుంది. ఆల్రెడీ తెలంగాణ , ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కోసం పర్మిషన్స్ కష్టమనే విషయం వారిని కలవరపెడుతుంది. ఇదిలా ఉంటె ఇప్పుడు కేరళలో కూడా ఈ అడ్డంకులు తప్పడం లేదు. క్రిస్టమస్ దగ్గరపడుతుండటంతో.. అక్కడ ఇలాంటి భారీ ఈవెంట్స్ కు బందోబస్తు కష్టమని చెప్తున్నారట.

ఆల్రెడీ ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో భారీగా క్రేజ్ ఉంది.. ఇక 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. ఇంత క్రేజ్ ఉండడంతో ఈవెంట్ కు అభిమానులు భారీగానే తరలి వస్తారు. సో అంత మందిని కంట్రోల్ చేయడం సాధ్యం కాదని.. పర్మిషన్స్ కష్టం అని అంటున్నారట. అయితే ఎలాగూ హైప్ బాగానే ఉంది.. అసలే అల్లు అర్జున్ కు కేరళలో మల్లు అర్జున్ అంటూ పేరు ఉంది. సో ప్రమోషన్స్ లేకపోయినా సరే సినిమా పక్కా హిట్ అవుతుందని చెప్పేయొచ్చు. పార్ట్ 1 సమయంలో హైప్ లేకపోయినా, ప్రమోషన్స్ లేకపోయినా సరే కాలం కలిసొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం పుష్ప 2 టీం కు కొన్ని అడ్డంకులు తప్పడం లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.