iDreamPost
android-app
ios-app

షారుఖాన్ పై పగబట్టి సలార్! గురి చూసి కొట్టినట్టుందే!

  • Published Dec 22, 2023 | 5:35 PM Updated Updated Dec 22, 2023 | 5:35 PM

Prashanth Neel Vs Shahrukh Khan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీకి బ్లాక్​బస్టర్ టాక్ వచ్చేసింది. ఇదే సమయంలో కింగ్ ఖాన్ షారుఖ్ పై పగబట్టినట్లు ప్రశాంత్ నీల్ సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తకరమైన విషయం వైరల్ అవుతోంది.

Prashanth Neel Vs Shahrukh Khan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీకి బ్లాక్​బస్టర్ టాక్ వచ్చేసింది. ఇదే సమయంలో కింగ్ ఖాన్ షారుఖ్ పై పగబట్టినట్లు ప్రశాంత్ నీల్ సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తకరమైన విషయం వైరల్ అవుతోంది.

  • Published Dec 22, 2023 | 5:35 PMUpdated Dec 22, 2023 | 5:35 PM
షారుఖాన్ పై పగబట్టి సలార్! గురి చూసి కొట్టినట్టుందే!

చలనచిత్ర దిగ్గజాల యుద్ధంలో ‘సలార్’ విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీనికి ఒక్కరోజు ముందు రిలీజైన  ‘డంకీ’ మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చింది. ఒక్క రోజు గ్యాప్ తో ఈ రెండు సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే.  విడుదలకు ముందు కూడా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో..  ఈ రెండు చిత్రాలు పోటీ పడ్డాయి. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా డంకీ ఎక్కువ కలెక్షన్ల సంపాదించిందని.. దీనితో సలార్ కంటే డంకీ చిత్రానికే ఎక్కువ క్రేజ్ ఉందంటూ..  బాలీవుడ్ మీడియా కొన్ని కథనాలు కూడా చేసింది. కానీ, అటువంటి కథనాలన్నిటినీ  ‘సలార్’ ఫస్ట్ షో తోనే తుడిచిపెట్టేసింది. కాగా, యాక్షన్ చిత్రమైన ‘సలార్’ వలన ‘డంకీ’ కి లాస్ ఉంటుందని సినీ విశ్లేషకులు భావించగా.. ఇప్పుడు అదే వాస్తవం అయింది.

ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగిన వార్ లో.. ప్రస్తుతం ‘సలార్’ దే పై చేయి.  సాధారణ సినిమాలే ఇలా ఒక రోజు వ్యవధిలో విడుదల చేయాలంటే ఎంతో ఆలోచిస్తారు. అలాంటిది  ఇద్దరు పాపులర్ స్టార్స్ చిత్రాలు వెంట వెంటనే విడుదల చేసి.. అభిమానులలో  మరింత ఆసక్తిని నెలకొల్పారు. ఇలా ఒక రోజు గ్యాప్ తో రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదల అవ్వడం అరుదైన విషయం. ఈ చిత్రాలు విడుదల అవ్వడానికి ముందు నుంచే పోటీ పడుతూ వచ్చాయి. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోను, థియేటర్లు బ్లాక్ చేసిన విషయంలోనూ అంతటా  ఉద్రిక్తతను సృష్టించారు. కానీ, భారీ అంచనాల మధ్యన,  డిసెంబర్ 21న విడుదలైన షారుక్ నటించిన డంకీ నార్మల్ ఆడియన్సుకే కాదు షారుక్ అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయింది.

Shah Rukh was targeted and hit

వెంటనే డిసెంబర్22న ప్రభాస్ నటించిన సలార్ విడుదల అయ్యి.. మొదటినుంచే మంచి టాక్ రావడంతో .. ఈ హిట్ దెబ్బ  డంకీకి తగిలిందని  చెప్పి తీరాలి. ఒకవేళ డంకీ.. సలార్ తో పోటీ పడకపోయి ఉంటే షారుక్ చిత్రానికి  కాస్త కలెక్షన్ల నష్టం తగ్గివుండేదేమో. సలార్  తో పోటీ పడిన కారణంగా ఇప్పుడు ఈ రెండిటిని పోల్చడం మొదలుపెట్టారు. అదీ కాకుండా ప్రశాంత్ నీల్ షారుక్ కు పోటీగా వెళ్లి ఓడించడం ఇది రెండవ సారి.  గతంలో షారుఖ్ నటించిన జీరో మూవీ రిలీజ్ చేసిన సమయంలోనే ప్రశాంత్ కెజీఎఫ్-1 ను విడుదల చేసి.. షారుక్ కు కొంత కాలం పాటు సినిమాలు లేకుండా చేశాడు.

ఆ తర్వాత,  ఇప్పుడిప్పుడే పఠాన్, జవాన్ అంటూ వరుస హిట్స్ బాటను పడుతున్న షారుక్ కు..  ‘డంకీ’ కి పోటీగా వెళ్ళి సలార్’ తో సైలెంట్  చేసేశాడు. ఇలా రెండుసార్లు ప్రశాంత్ నీల్ షారుక్ కు షాక్ ఇచ్చాడు.  ఇది కావాలని  చేశాడో లేదా యాక్సిడెంటల్ గా జరిగిందో తెలియదు కానీ..సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రశాంత్ దెబ్బ షారుక్ చిత్రంపైనే పడింది. కనీసం ‘సలార్’ చిత్రం విడుదలకు కొన్ని రోజులు ముందు కానీ, తర్వాత కానీ  ‘డంకీ’ విడుదల చేసి ఉంటే.. ఇప్పుడు ‘డంకీ’కి ఇటువంటి పోలిక తప్పేదేమో. ఇక విడుదలకు ముందు నుంచే నార్త్  అభిమానులు సలార్ పై చేసిన ట్రోలింగ్స్ కి ..ఇప్పుడు సౌత్ ఆడియన్సు దీటుగా సమాధానం ఇస్తున్నారు. ఏదేమైనా, ప్రశాంత్ ‘సలార్’ తో తన స్థాయిని మళ్లీ నిరూపించుకున్నాడు. మరి, ప్రశాంత్ దెబ్బ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వెళ్లి షారుక్ చిత్రంపైనే పడడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet