prabhas ప్రభాస్ సీరియస్ గా తీసుకోవాల్సిందే

ఇటీవలే రాధే శ్యామ్ డిజాస్టర్ తో డీలాపడిన డార్లింగ్ అభిమానులకు నిన్న దర్శకుడు ఓం రౌత్ ఆది పురుష్ గురించి ఇచ్చిన అప్ డేట్ ఒళ్ళు మండేలా చేసింది. సోషల్ మీడియాలో వేర్వేరు కళాకారులు ప్రభాస్ లుక్ మీద వేసిన పెయింటింగ్స్ డ్రాయింగ్స్ ని ఏదో గొప్ప విశేషం లాగా అఫీషియల్ హ్యాండిల్ లో పోస్ట్ చేయడం మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. శ్రీరామనవమి లాంటి పర్వదినానికి ఆయన మీద తీస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇవ్వడంలో ఎందుకింత అలసత్వం చేశారనే విమర్శలు జోరుగానే వచ్చి పడుతున్నాయి. ఓం రౌత్ కి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వాళ్ళు అన్న తిట్లకు నిద్రరావడం కష్టం.

ఇక్కడ ప్రభాస్ సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఒకటుంది. సోషల్ మీడియా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటోంది. కలెక్షన్లలో మహారాజ పోషకులుగా వ్యవహరిస్తున్న మాస్ ఆడియన్స్, యూత్ అంతా అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సినిమాల గురించి ఏ సమాచారమైనా అందులో వచ్చిందే నమ్ముతున్నారు. అది నిజం కావొచ్చు అబద్దం కావొచ్చు. కానీ ఆ ప్రభావం చాలా ఎక్కువ ఉంటోంది. కానీ సాహో, రాధే శ్యామ్ ల విషయంలో యువి క్రియేషన్స్ అనుసరించిన ధోరణి ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఒక నిర్మాణ సంస్థ ఈ స్థాయిలో ట్రోలింగ్ కి గురి కావడం ఎవరికీ జరగలేదు. ఈ మాట ప్రభాస్ కు సైతం తెలుసు.

అలాంటప్పుడు బలమైన పిఆర్ టీమ్ ని ఏర్పరుచుకోవడం చాలా అవసరం. పుష్ప పార్ట్ 1 నార్త్ లో ఆ స్థాయిలో కలెక్షన్లు రాబట్టుకోవడానికి కేవలం కంటెంట్ మాత్రమే కారణం కాదు. ఆ మాటకొస్తే అదేమీ బాహుబలి రేంజ్ బొమ్మా కాదు. అయినా ఎందుకు ఎగబడి చూశారు. ప్రమోషన్ అంత శ్రద్ధగా చేశారు కాబట్టి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదాలు పక్కనపెడితే రాజమౌళి టీమ్ పబ్లిసిటీ ఏ రేంజ్ లో అదరగొట్టారో చూశాం. ఇప్పటికీ ఈ సినిమా గురించి దేశవిదేశీయుల నుంచి ట్వీట్లు వస్తూనే ఉన్నాయి, నార్త్ ఆడియన్స్ ప్రశంసలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. ప్రభాస్ ఇకపై ఇలాంటి ట్రెండింగ్ మీద ఫోకస్ పెట్టడం చాలా అవసరం

 

Show comments