iDreamPost
android-app
ios-app

పీకాచుకి లైవ్ లో డబ్బింగ్ ఎంత క్యూట్ గా చెప్తోందో చూడండి..

కార్టూన్లను ఇష్టపడని పిల్లలు ఉండరు. అయితే ఇవి యానిమేటెడ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్టూన్లకు యానిమేషన్స్ చేసి ప్రాణం పోసినా.. వాటికి మరింత జీవంలా మారాయి.. డైలాగ్స్. వీటికి డబ్బింగ్ అందిస్తోంది ఎవరో తెలుసా.?

కార్టూన్లను ఇష్టపడని పిల్లలు ఉండరు. అయితే ఇవి యానిమేటెడ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్టూన్లకు యానిమేషన్స్ చేసి ప్రాణం పోసినా.. వాటికి మరింత జీవంలా మారాయి.. డైలాగ్స్. వీటికి డబ్బింగ్ అందిస్తోంది ఎవరో తెలుసా.?

పీకాచుకి లైవ్ లో డబ్బింగ్ ఎంత క్యూట్ గా చెప్తోందో చూడండి..

బుల్లితెరపై సినిమాలు, ధారావాహికలు, ప్రత్యేక కార్యక్రమాలు పెద్దలను అలరిస్తుంటే.. కార్టూన్ ఛానల్స్ పిల్లల్ని కట్టిపడేస్తున్నాయి. పిల్లలకు అన్నంత తినిపించాలన్నా, వాళ్లు మారం చేసిన ముందుగా చూపించేవి బొమ్మల ఛానల్సే. సండే వస్తే చాలు గంటలు గంటలు చిన్నపిల్లలు టీవీల ముందు కూర్చుని తమకు నచ్చిన కార్టూన్స్ చూస్తుంటారు. లేదంటే యూట్యూబ్ ఓపెన్ చేసి.. అందులో కార్టూన్స్ వాచ్ చేస్తుంటారుు. టామ్ అండ్ జెర్రీ నుండి ఇప్పుడు వచ్చే పోకీమాన్ వరకు పిల్లల్ని అలరిస్తూనే ఉన్నాయి. కార్డూన్లకు యానిమేషన్ చేసి ప్రాణం పోయడం ఎంత కష్టమో.. వాటి మాటలు తీసుకు రావడం కూడా అంతే కష్టం. అయితే ఏఏ భాషల్లో ప్రసారమౌతుంటాయో.. ఆయా లాంగ్వెజెస్‌లో డబ్బింగ్ చేసి ప్రచారం చేస్తుంటారు. యానిమేటెడ్ బొమ్మల పెదాల కదలికకు, ఎక్స్ ప్రెషన్, సిచ్యుయేషన్స్‌కు తగ్గట్లు గాత్రం అందించాల్సి ఉంటుంది. ఇదిగో అలా అనేక కార్డూన్లకు గొంతు అరువు ఇచ్చి ఫేమస్ అయ్యింది ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్.

చాలా మందికి డోరేమాన్, పోకీమాన్ అంటే చాలా ఇష్టమైన కార్టూన్ షో. బద్దకస్తుడైన నోబితాకు అన్ని వేళలా అండగా ఉండి.. అన్ని గ్యాడ్జెట్స్ అందిస్తూ.. ఆపదల నుండి కాపాడే క్యారెక్టరే ఈ డోరేమాన్. మరీ డోరేమాన్ అంతలా అలరించడానికి ఓ కారణం.. వాయిస్ కూడా. ఇంతకు ఆ గాత్రం ఇచ్చింది ఎవరో తెలుసా.. సోనాల్ కౌశల్.  ఆమె ఒక వాయిస్ ఆర్టిస్ట్. హిందీ డబ్బింగ్ వర్షన్‌కు సోనాల్ గొంతు ఇచ్చింది. ఆమెకు మరో ముద్దు పేరు కూడా ఉంది. అదే మోటర్ మౌత్.  ఈ కార్టూన్ ఎంతగా అలరించిందో అందరికీ తెలుసు. 2005 -2020 వరకు నిర్విరామంగా ప్రసారమైన ఈ పప్పెట్‌కు వాయిస్ ఇచ్చింది సోనాలే. ఇక మరో జపనీస్ బొమ్మల కథ పోకీమాన్‌లో పీకాచు క్యారెక్టర్ కూడా ఆమె గాత్రం అందించింది. ‘పీకా.. పీకాచు’ అంటూ ఉంటుంది ఓ వింత జీవి. ఆ పాత్రకు కూడా సోనాలి వాయిస్ ఇచ్చింది. ఇది చాలా మందికి ఫేవరేట్ కార్టూన్ కూడా.

8 సంవత్సరాల నుండే ఆమె డబ్బింగ్ చెబుతోంది సోనాల్. ఆమె అనేక బొమ్మలకు తన గొంతుతో ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ద పవర్ ఫమ్ గర్ల్స్, లిటిస్ సింగం, చోటా భీమ్, స్టార్ వార్స్ విజన్స్ వంటి యానిమేటెడ్ సిరీస్‌కు వాయిస్ ఇచ్చింది. ఇవే కాదూ యానిమేటెడ్ చిత్రాలకు కూడా డబ్బింగ్ చెప్పింది సోనాల్. డోరేమాన్, ఇంక్రెడిబుల్స్ 2, టాయ్ స్టోరీ వంటి కార్టూన్ చిత్రాలకు పని చేసింది. ఇవే కాకుండా అమీ జాక్సన్, వేదిక హీరోయిన్లకు డబ్బింగ్ ఇచ్చింది సోనాల్. హాలీవుడ్ చిత్రాల డబ్బింగ్ వర్షన్లకు వర్క్ చేసింది. ఓ సౌత్ ఇండియన్ మూవీకి కూడా పని చేసింది ఈమె. కిచ్చా సుదీప్..హెబ్బులి మూవీలో ప్రాచీ అనే నటికి గాత్రం అందించింది. ప్రస్తుతం తాను వాయిస్ అందిస్తున్న కార్టూన్లకు సంబంధించి.. వీడియోలను ఇన్ స్టా వేదికగా పంచుకుంటుంది. 2020లో ఉత్కర్ష్ బాలి అనే వ్యక్తిని మనువాడింది సోనాల్. ఈ దంపతులకు ఓ పాప.

 

View this post on Instagram

 

A post shared by Sonal Kaushal (@the_motormouth)