iDreamPost
android-app
ios-app

మరి కొద్దీ గంటల్లో దేవర తుఫాన్.. థియేటర్స్ తగలపడిపోవడం ఖాయం

  • Published Sep 26, 2024 | 11:29 AM Updated Updated Sep 26, 2024 | 11:29 AM

Devara Movie: ఎప్పుడెప్పుడు తెరపై జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తామా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల.. ఆశలు మరికొద్ది గంటల్లో తీరబోతుంది. దేవర ఆగమనానికి ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది.

Devara Movie: ఎప్పుడెప్పుడు తెరపై జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తామా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల.. ఆశలు మరికొద్ది గంటల్లో తీరబోతుంది. దేవర ఆగమనానికి ఇంకా కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది.

  • Published Sep 26, 2024 | 11:29 AMUpdated Sep 26, 2024 | 11:29 AM
మరి కొద్దీ గంటల్లో దేవర తుఫాన్.. థియేటర్స్ తగలపడిపోవడం ఖాయం

అంతా రెడీ ఇక తెరపై తారక్ మాస్ యాక్షన్స్ తో పాటు.. కథను చూడడం మాత్రమే బ్యాలెన్స్. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ బాగానే ఉంది. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ హైప్ ను క్రియేట్ చేశారు అభిమానులు. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ కూడా హైప్ ను పీక్స్ లోకి తీసుకెళ్లాయి. ఇక దేవర ఊచకోత మొదలవ్వడమే ఆలస్యం. ఇక దేవరలో సంద్రం ఎరుపెక్కినట్లుగా.. ఫ్యాన్స్ తాకిడికి థియేటర్స్ ఎరుపెక్కడం ఖాయం. మరో కొద్దీ గంటల్లో దేవర తుఫాన్ తీరాన్ని దాటనుంది.. ఇప్పటికే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు మేకర్స్. అసలు ఈ సినిమా ఓపెనింగ్ రోజే మృగాలా వేట చూస్తారని చెప్పకనే చెప్పారు కొరటాలా… దానికి తగినట్లుగానే బ్లడ్ మూన్ షాట్ , ఫియర్ సాంగ్ ఇంకా ఎన్నో అప్డేట్స్ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక సినిమాకే హైలెట్ గా ఉంటుందంటూ ఫుల్ హైప్ పెంచేసి దాచిపెట్టిన ఆయుధ పూజ సాంగ్ ను మాత్రం నేరుగా థియేటర్స్ లోనే చూసేలా ప్లాన్ చేశారు మేకర్స్.

ఆయుధ పూజ సాంగ్ కు థియేటర్ లో పోతారు మొత్తం పోతారు అంటూ.. నెట్టింట సందడి చేస్తున్నారు అభిమానులు. ఏమౌతుందో చూడాలి మరి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా వస్తున్న అప్డేట్స్ దెబ్బకు.. సోషల్ మీడియా ఎరుపెక్కింది. థియేటర్స్ దగ్గర కూడా పండగ వాతావారణం నెలకొంది. తారక్ కట్ ఔట్స్ కు పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. ఇలా మొత్తానికి అర్ధరాత్రి నుంచి థియేటర్స్ దగ్గర దేవర జాతర మొదలవ్వనుంది. ఇక ఇప్పటివరకు మూవీలో సాంగ్స్ బాగా హైలెట్ గా నిలిచాయి. సో దీనితో ఈ అనిరుద్ ఇంకా మూవీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడా అని.. ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగిపోయింది. మరి కొరటాల కథ.. అనిరుధ్ మోత.. దేవర ఊచకోత ఎలా ఉండబోతాయో.. చూడాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

ఇక అప్పుడే ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ బుకింగ్స్ ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓపెనింగ్స్ రోజే రూ.100 కోట్ల కొల్లగొట్టిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేస్తుంది దేవర. మరి ఇన్ని భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లోకి వస్తున్న దేవర.. ఆ అంచనాలను నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.