iDreamPost

Nivetha Thomas: హీరోయిన్ అంటే ఆ సైజ్​లోనే ఉండాలా? నివేదా థామస్ కౌంటర్​!

  • Published Jul 03, 2024 | 10:13 PMUpdated Jul 03, 2024 | 10:35 PM

టాలీవుడ్​లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. గ్లామర్​కు ఆమడ దూరంలో ఉంటూ యాక్టింగ్​కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లకే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.

టాలీవుడ్​లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. గ్లామర్​కు ఆమడ దూరంలో ఉంటూ యాక్టింగ్​కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లకే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.

  • Published Jul 03, 2024 | 10:13 PMUpdated Jul 03, 2024 | 10:35 PM
Nivetha Thomas: హీరోయిన్ అంటే ఆ సైజ్​లోనే ఉండాలా? నివేదా థామస్ కౌంటర్​!

టాలీవుడ్​లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. గ్లామర్​కు ఆమడ దూరంలో ఉంటూ యాక్టింగ్​కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లకే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ‘నిన్ను కోరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘జై లవకుశ’, ‘వకీల్​సాబ్’ సినిమాలతో ఆమె తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. తనదైన సటిల్ ఎక్స్​ప్రెషన్స్​తో మూవీ లవర్స్​కు ఫేవరెట్ యాక్ట్రెస్​గా మారిపోయారు. అయితే మిగతా హీరోయిన్లలా కాకుండా ఆమె చాలా సెలెక్టివ్​గా ఫిల్మ్స్ చేస్తుంటారు. వచ్చింది కదా అని ఏది పడితే ఆ ఆఫర్​కు ఓకే చెప్పరు. తన మనసుకు నచ్చిన ప్రాజెక్టుల్లో మాత్రమే ఆమె నటిస్తుంటారు. అలాంటి నటి నుంచి ఓ సినిమా వస్తుందంటే మూవీ గోయర్స్​లో ఉండే ఇంట్రెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

నివేదా థామస్ నుంచి మరో డిఫరెంట్ మూవీ రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. తిరుపతి నేపథ్యంలో సాగే కథతో ఫిల్మ్​ను రూపొందించారు. ఇందులో తల్లి పాత్రలో యాక్ట్ చేశారు నివేదా. ఎగ్జామ్స్​లో పాస్ మార్క్స్ రానందుకు తండ్రి మందలించడంతో కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ఆ పిల్లాడి కోసం తల్లి ఆరాటపడే సీన్స్​ టీజర్​ను మరింత ఇంట్రెస్టింగ్​గా మార్చేశాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్​లో నివేదా థామస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాడీ షేమింగ్ గురించి ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె కౌంటర్ ఇచ్చారు. హీరోయిన్ అంటే జీరో సైజే ఉండాలా అని ఆమె ఎదురు ప్రశ్నించారు.

అనుష్క లేదా మీ లాంటి పలువురు ఆర్టిస్టుల విషయంలో బాడీ షేమింగ్ బాగా చర్చనీయాంశంగా మారిందని ఓ జర్నలిస్ట్ అన్నారు. హీరోయిన్ అంటే జీరో సైజే అని సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతోందన్నారు. దీనికి నివేదా దీటుగా బదులిచ్చారు. ఈ వైరల్ అంతా మీకే వస్తుందేమో.. తనకు రావట్లేదని అన్నారు. ఈ సినిమా టైటిల్ అయిన 35 అనేది టెక్నీషియన్స్, ఆర్టిస్టులు లేదా ఇతరుల వెయిట్​కు సంబంధించినది కాదన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. 35 అనేది బరువుకు సంబంధించినది కాదని అనడం ద్వారా.. ఆ సైజ్​లోనే ఉండాలా అని ఇన్​డైరెక్ట్​గా నివేదా క్వశ్చన్ చేశారని అంటున్నారు. మరి.. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులపై జరిగే బాడీ షేమింగ్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి