iDreamPost
android-app
ios-app

వీడియో: తల్లితో తన బాండింగ్ పై విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్!

  • Published Jul 03, 2024 | 8:57 PM Updated Updated Jul 03, 2024 | 8:57 PM

Vijay Devarakonda Emotional Comments On His Mother: రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ ఒక షోకి ప్రత్యేక అతిథిగా వచ్చాడు. ఆ షోలో తల్లితో తనకున్న బాండింగ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

Vijay Devarakonda Emotional Comments On His Mother: రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ ఒక షోకి ప్రత్యేక అతిథిగా వచ్చాడు. ఆ షోలో తల్లితో తనకున్న బాండింగ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

  • Published Jul 03, 2024 | 8:57 PMUpdated Jul 03, 2024 | 8:57 PM
వీడియో: తల్లితో తన బాండింగ్ పై విజయ్ దేవరకొండ ఎమోషనల్ కామెంట్స్!

విజయ్ దేవరకొండ.. ఈ సెల్ఫ్ మేడ్ స్టార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనాలి. ఇండస్ట్రీలో తనను తాను లేపుకుంటూ ఇంత దూరం వచ్చాడు. అంతేకాకుండా.. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఈ రౌడీ హీరో ఎప్పుడూ ముందే ఉంటాడు. అలాగే ఈసారి కూడా తెలుగు సింగర్స్ ని సపోర్ట్ చేయడానికి ఆహా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3కి గెస్ట్ వచ్చేశాడు. రావడమే కాకుండా.. అక్కడున్న సింగర్స్ ని ఎంకరేజ్ చేస్తూ.. వారికి కొన్ని సర్ ప్రైజెస్ కూడా ఇచ్చాడు. అలాగే.. షోలో మాట్లాడుతూ తన తల్లితో తనకున్న బాండింగ్ గురించి విజయ్ దేవరకొండ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందు ఉంటాడని మరోసారి రుజువైంది. ఈ రౌడీ హీరో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్ 7- 8కి గెస్ట్ గా వచ్చాడు. ఆ ఎపిసోడ్లకు సంబంధించిన ప్రోమోని ఆహా తాజాగా రిలీజ్ చేసింది. ఆ ప్రోమోలో విజయ్ దేవరకొండ ఎంత డౌన్ టూ ఎర్త్ ఉంటాడు అనే విషయాలు స్పష్టంగా మరోసారి అర్థమవుతుంది. సింగర్స్ అందరినీ పేరు పేరున పొగడటమే కాకుండా.. కుటుంబానికి దూరంగా ఉన్న ఒక సింగర్ కోసం తన త్లలిదండ్రుల నుంచి ఒక వీడియో మెసేజ్ కూడా తెప్పించాడు. అలాగే ఆ కుర్రాడిని పిలిచి హగ్ చేసుకుని ఎంకరేజ్ చేశాడు.

అంతేకాకుండా.. ఈ షోలో స్టేజ్ ఒక 15 ఏళ్ల సింగర్ తన తల్లి గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఈ లోకంలో ఉన్న అందరు మదర్స్ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. “ఆ దేవుడికి మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మన అందరి జీవితాలకు అమ్మని ఇచ్చినందుకు. మా అమ్మ నవ్వుతూ హ్యాపీగా ఉంటే.. నేను అన్నీ పనులు ఆపేసి అలా చూస్తూ ఉంటాను.” అంటూ విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. ఇంక ఈ ప్రోమోలో చాలానే విషయాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ చేసిన అల్లరి కూడా ఉంది. అలాగే థమన్ కూడా ఒక సింగర్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. భం భం భోలే పాటను లైవ్ లో రికార్డ్ చేసి.. దానిని మణిశర్మకు సెండ్ చేసినట్లు చెప్పాడు. ఈ ప్రోమో చూసిన తర్వాత రౌడీ హీరో చేసిన అల్లరి, సింగర్స్ ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శన చూడాలి అంటే మీరు జూలై 5, 6 వరకు ఆగాల్సిందే. ఈ రెండు ఎపిసోడ్స్ ఆ తేదీల్లో సాయంత్రం 7 గంటలకు స్ట్రీమింగ్ కు వస్తాయి. మరి.. ఈ ప్రోమో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom