iDreamPost
android-app
ios-app

భర్తను మళ్లీ ఫాలో అయిన నయనతార.. హమ్మయ్య అనుకున్న అభిమానులు!

  • Published Mar 04, 2024 | 4:48 PM Updated Updated Mar 04, 2024 | 4:48 PM

స్టార్ హీరోయిన్ నయనతార గత రెండ్రోజులుగా ఫ్యాన్స్​ను కంగారు పెట్టేశారు. అయితే వారికి ఊరట కలిగిస్తూ తాజాగా ఆమె చేసిన పనికి అంతా హమ్మయ్య అనుకున్నారు.

స్టార్ హీరోయిన్ నయనతార గత రెండ్రోజులుగా ఫ్యాన్స్​ను కంగారు పెట్టేశారు. అయితే వారికి ఊరట కలిగిస్తూ తాజాగా ఆమె చేసిన పనికి అంతా హమ్మయ్య అనుకున్నారు.

  • Published Mar 04, 2024 | 4:48 PMUpdated Mar 04, 2024 | 4:48 PM
భర్తను మళ్లీ ఫాలో అయిన నయనతార.. హమ్మయ్య అనుకున్న అభిమానులు!

లేడీ సూపర్ స్టార్ నయనతార తన అభిమానులను గత రెండ్రోజులుగా ఒక విధంగా కంగారు పెట్టేశారు. ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్​ను నయనతార పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ జంటకు ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో జరిగిన ఒక చిన్న పొరపాటు కారణంగా ఈ కపుల్ విడిపోనుందనే పుకార్లు చెలరేగాయి. నిజానికి కాంట్రవర్సీ అనేది హీరోయిన్ నయనతారకు కొత్తేమీ కాదు. ఇటీవల తన సినిమా ‘అన్నపూర్ణి’ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు విమర్శించడంతో వివాదాన్ని ఎదుర్కొన్నారు. అలాంటి అనుకోని ఆరోపణల వల్ల చివరికి నెట్​ఫ్లిక్స్ ప్లాట్​ఫామ్ నుంచి ఆ చిత్రాన్ని తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ లేడీ సూపర్ స్టార్ మరొక కారణంతో మళ్లీ వార్తల్లో నిలిచారు.

నయనతార రిలేషన్​షిప్ స్టేటస్ గురించి తాజాగా చాలా పుకార్లు వచ్చాయి. ఆమె తన భర్త విఘ్నేష్ శివన్‌ను మార్చి 3వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో ఒక్కసారిగా రూమర్స్ చెలరేగాయి. దీంతో ఫ్యాన్స్ కూడా తమ అభిమాన నటి విడిపోతుందేమోనని అనుమానించారు. అయితే, కొన్ని గంటల్లోనే నయనతార తిరిగి తన భర్తను ఫాలో అవడంతో విడాకుల పుకార్లకు విశ్రాంతినిచ్చినట్లు అయింది.

దర్శకుడు విఘ్నేష్ శివన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నయనతారతో ఉన్న ఫోటోను పంచుకున్నారు. దాంతో ఈ జంట మధ్య అంతా బాగానే ఉందని అభిమానులు ఆనందపడ్డారు. అయితే ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల అన్‌ఫాలో-ఫాలో అవడం వెనుక సాంకేతిక సమస్య ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక, ప్రస్తుతం నయనతార తన తదుపరి సినిమా ‘టెస్ట్’ విడుదల కోసం వేచి చూస్తున్నారు. శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విలక్షణ నటుడు ఆర్ మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చదవండి: OTTలోకి బ్యాన్ చేసిన సినిమా.. 350 కోట్ల బ్లాక్ బస్టర్!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio