iDreamPost

OTTలోకి బ్యాన్ చేసిన సినిమా.. 350 కోట్ల బ్లాక్ బస్టర్!

  • Published Mar 04, 2024 | 2:03 PMUpdated Mar 14, 2024 | 4:53 PM

ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన లెటెస్ట్ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. అది ఎప్పుడంటే..

ఎట్టకేలకు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన లెటెస్ట్ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. అది ఎప్పుడంటే..

  • Published Mar 04, 2024 | 2:03 PMUpdated Mar 14, 2024 | 4:53 PM
OTTలోకి బ్యాన్ చేసిన సినిమా.. 350 కోట్ల బ్లాక్ బస్టర్!

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్.. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ సినిమాల తర్వాత నటించిన లెటెస్ట్ మూవీ ‘ఫైటర్’. హై వోల్టేజ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో అనిల్ కపూర్ మరో కీలక పాత్రలో మెరిసారు. కాగా, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న థియేటర్లలో రిలీజైంది.ఇక ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యానికి దేశ భక్తిని జోడించి తెరకెక్కించిన ఫైటర్‌ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ఫైటర్ మూవీ ఫైటర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 210 కోట్ల నెట్ కలెక్షన్స్, రూ. 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ సినిమా కొన్ని వివాదాల వలన ఓటీటీ స్ట్రీమింగ్ వాయిద పడిన విషయం తెలిసిందే. అయితే , తాజాగా ఫైటర్ మూవీ ఓటీటీ వివరాలకు సంబంధించి రిలీజ్ డేట్స్ ఆసక్తికరగా మారింది. ఇంతకి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

హృతిక్‌ రోషన్‌ లెటెస్ట్ గా నటించిన ‘ఫైటర్’ మూవీ భారతదేశంలోనే తొలి ఎయిర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా గుర్తింపు పొందింది.అయితే భారీ విజయానన్ని సాధించిన ఈ సినిమా గతకొన్ని రోజులగా ఓటీటీ రిలీజ్ కాబోతుందనే వార్త జోరుగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 180 కోట్లు పెట్టి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.కానీ, ఓటీటీ రిలీజ్ థియేట్రికల్ రన్‌కి 50 రోజుల తర్వాత ఉంటుందని టాక్ నడిచింది. దాంతో మార్చి నాలుగో వారంలో ఫైటర్ ఓటీటీలోకి వస్తుందని అంతా అనుకున్నారు. అయితే అందుకు తగ్గట్లుగానే ఫైటర్ సినిమా మార్చి 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. కానీ అంతకంటే ముందుగానే మార్చి రెండవ వారంలోనే ఈ ఫైటర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారని మరో టాక్ నడుస్తోంది.

అయితే, ఫైటర్ సినిమాల విషయంలో.. హృతిక్ చూట్టు కొన్ని వివాదులు చుట్టుముట్టాయి. ఎందుకంటే.. ఈ సినిమాలో ఎయిర్‌ ఫోర్స్‌ యూనిఫాంలో ఉన్న హృతిక్ రోషన్, దీపికా మధ్య కొన్ని లిప్ లాక్ సీన్స్‌, రొమాంటిక్‌ సన్నివేశాలపై విమర్శలతో పాటు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ విషయపై ఇదివరకే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన అధికారి ఒకరు ఫైటర్ సినిమాకు లీగల్ నోటీసులు కూడా పంపిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఫైటర్ సినిమాపై పలు గల్ఫ్ కంట్రీస్ నిషేధం విధించాయి. ఇక ఒక్క దుబాయ్ (యూఏఈ) తప్పా మిగతా గల్ఫ్ దేశాలన్నింటిలోనూ ఫైటర్ సినిమాను బ్యాన్ చేశారు. అందుకు కారణం.. ఉగ్రదాడలు, జమ్ము కశ్మీర్ వంటి సెన్సిబుల్ కంటెంట్ ఉన్న సినిమాలను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తూ వస్తున్నాట్లు సమాచారం తెలిసింది.

ఇక ఫైటర్ మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ పతాకాలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే ప్రెస్టిజీయస్‌గా నిర్మించారు. అలాగే ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందించారు. కాగా, ఇందులో అనిల్ కపూర్ తో పాటు అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఇక పవర్ ఫుల్ విలన్‌గా రిషబ్ సాహ్ని నటించాడు. మరి, త్వరలో ఫైటర్ మూవీ ఓటీటీలోకి రాబోతుండం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి